Breaking News

లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా 16 రోజుల అవగాహనా కార్యక్రమాలు

-రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యదర్శి విద్యాపురపు వసంత బాల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ప్రభుత్వం 25.11.2024 నుండి 10.12.2024 వరకు “లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా 16 రోజుల అవగాహనా కార్యక్రమాలు” రూపొందిoచినందున మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MWCD)ఆదేశాలకు అనుగుణంగా జాతీయ మహిళా కమిషన్ (NCW)న్యూఢిల్లీ సహకారంతో కొన్ని కార్యక్రమాలను నిర్వహించడానికి రాష్ట్ర మహిళా కమిషన్‌లకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ 10 డిసెంబర్ 2024 న విజయవాడలోని మారిస్ స్టెల్లా కాలేజీలోని ఆడిటోరియం హాల్‌లో మధ్యాహ్నం 2.00 గంటల నుండి ‘05.00 సాయంత్రం వరకు 500 మంది బాలికలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఇందులో ప్రముఖులు వక్తలుగా పాల్గొంటారని ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *