విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గౌ. వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ, విజయవాడ వారి ఆదేశాల మేరకు, ది 04-12-2024 న మధ్యాహ్నం పౌరసఫారాల సంస్థ కేంద్ర కార్యాలయ సిబ్బంది అయిదు బృందాలుగా కృష్ణ జిల్లా లోని పలు మండలాలో ఉన్న రైస్ మిల్లులను ఆకస్మిక తనిఖీలు నిర్వహించటం జరిగింది.సదరు తనిఖీలలో ముఖ్యాంశాలు ఏమనగా, మిల్లు ఆవరణ లో ఉన్న ధాన్యము వాహానములు దిగుమతి చేసుకోవటం లో జాప్యం జరుగుచున్నధనియు మరియు పలు చోట్ల రైతులను ఇబ్బంది పెడుతున్నరని ఇంకను మిల్లులు రైతుల వద్ద ధాన్యము తూకంలో కోత విదిస్తున్నారు అని తెలియజేసారు. సదరు మిల్లు విచారణలో తేలింది ఏమనగా,వాతావరణలో మార్పు వలన ధాన్యము కొనుగోలు ప్రక్రియలోవాహనముల దిగుమతి కొంత జాప్యం జరిగిందని, వాహనములు కొంత అలశ్యముగా దిగుమతి చేస్తూ ఉన్నామని రైతులను ఎటువంటి ఇబ్బందులు పెట్టలేదని తెలియజేసారు. కావున సదరు తనిఖీ లో ప్రతి రైస్ మిల్లుల ను ధాన్యము కొనుగోలు ప్రక్రియ లో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా మరియు మిల్లు వద్ద ధాన్యము వాహనములు దిగుమతి చేయుటలో జాప్యము జరిగిన సదరు మిల్లు పై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించటం జరిగింది.తనిఖి లో పౌరసరఫరాల సంస్థ సిబ్బంది, లీగల్ మెట్రాలజీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది వారు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News