Breaking News

‘కలశజ్యోతి ఊరేగింపులో సకల కళార్చన’

-శ్రీ కనకదుర్గమ్మ వారి భవానీ మండలదీక్షలను పురస్కరించుకుని కలశజ్యోతి ఊరేగింపు శనివారం సాయంత్రం శివరామనామ క్షేత్రం ప్రాంగణం సకల కళార్చనలతో శోభిల్లింది
-శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో సనాతన ధర్మప్రచారం, ఆధ్యాత్మిక వ్యాప్తి కొనసాగింది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధ్యాత్మిక, ధార్మిక, ప్రాచీన, సంప్రదాయ కళా ప్రదర్శనల మేళవింపులో వికారాబాద్‌ అటవీ ప్రాంతానికి చెందిన గిరిజనుల కొమ్ముకోయ నృత్యం(కొమ్ము డోలు)కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ కు చెందిన సంప్రదాయ చెండా మేళం -పంచ వాయిద్యం ,తూర్పు గోదావరి పిఠాపురం కు చెందిన సంప్రదాయ గరగ నృత్యం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ కి చెందిన మహిళా కోలాట నృత్యబృందములు, కృష్ణాజిల్లా గరికపర్రుకి చెందిన జానపద డప్పులు (తప్పెట్లు )కళా బృందం, అమలాపురంకి చెందిన వీరనాట్యం( వీరభద్ర నృత్యం) బృందం, విజయవాడకి చెందిన శ్రీ వాగ్దేవి కూచిపూడి నృత్యాలయ నాట్యాచార్య సప్పా శివ కుమార్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి, పరమేశ్వరుని వేషధారణతో కూచిపూడి కళాకారులు ప్రదర్శన చేశారు.విభిన్న, అరుదైన కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం పట్ల భవానీ భక్తులు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

ఆలయ కార్యనిర్వహణాధికారి కె. ఎస్. రామారావు కళా బృందాలను అభినందించారు.ఇటువంటి ఆలయ సంప్రదాయ ప్రదర్శనల ఏర్పాటు భవిష్యత్ తరాలుకి భక్తి, సంస్కృతిలను నేర్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతరించి పోతున్న కళారూపాలైన కొమ్ము కోయ( ఈ ప్రదర్శనలో అడవి దున్న కొమ్ములు ధరించిన గిరిజన పురుషులు డోలు వాయిస్తుండగా, నెమలీకలు ధరించిన గిరిజన స్త్రీలు లయబద్దంగా నృత్యం చేస్తారు – తెలంగాణ వికారాబాద్, ఆదిలాబాద్, ఆంధ్రా అల్లూరి జిల్లా చింతూరు లో మాత్రమే ఈ కళాకారులు ఉన్నారు ), వీర నాట్యం (వీరభద్ర నృత్యం) ఈ కళ గోదావరి జిల్లాల్లో కొంతమంది కళాకారులు మాత్రమే ఉన్నారు – దక్ష యజ్ఞం లో తనకు జరిగిన అవమానం తో సతీదేవి ఆహతి అవ్వగా, పరమ శివుని ఆగ్రహం వలన ఆయన జటా జూటం నుండి ఆవిర్భవించిన వీర భద్రుని అంశతో చేసే నృత్యమే ఈ వీర నృత్యం. ఇటువంటి కళారూపాలు ఏర్పాటు చేయడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

రామకోటి నుండి గాంధీనగర్, గవర్నర్ పేట, కంట్రోల్ రూమ్ పై వంతెన మీదుగా సుమారు 7 కిలోమీటర్లు ప్రయాణం గల ఈ కలశ జ్యోతి ఊరేగింపులో కళా ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *