Breaking News

బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకునేలా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటాం..

-అంత్యక్రియల నిమిత్తం తక్షణ సాయం కింద రూ.50 వేలు అందించిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం నగరంలో జరుగుతున్న పోలీస్ సెలక్షన్ ఈవెంట్స్ లో పరుగు పందెంలో అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించిన ధారావత్ చంద్రశేఖర్ (25) కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకునేలా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అంత్యక్రియల నిమిత్తం తక్షణ సాయం కింద గిరిజన, పోలీస్ శాఖల తరపున రూ .25 వేలు చొప్పున మొత్తం రూ.50 వేలు మృతుడి కుటుంబ సభ్యులకు ఆయన అందించారు. మచిలీపట్నం నుంచి మృతుడి స్వగ్రామానికి భౌతికాయాన్ని తరలించేందుకు అంబులెన్స్ ను ఏర్పాటు చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ.కొండూరు మండలం, జీలకొండ గ్రామానికి చెందిన దారావత్ చంద్రశేఖర్ మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని, ఎంతో భవిష్యత్తు కలిగిన ఆ యువకుడు మరణించటం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్సీ కమిషన్ బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఆ కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా ఎస్టి కమిషన్ సభ్యుడిగా తగిన కృషి చేస్తామని ఆయన కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. అంతకుముందు ఆయన స్థానిక బెల్ గెస్ట్ హౌస్ లో అదనపు ఎస్పి వివి నాయుడు, బందరు ఆర్డీవో కే స్వాతి, తహసిల్దార్ మధుసూదనరావు, గిరిజన సంక్షేమ అధికారి ఫణి ధూర్జటి తదితర అధికారులతో యువకుడి మరణానికి గల కారణాలు తదితర అంశాలపై చర్చించారు.

బందరు డిఎస్పి అబ్దుల్ సుభాన్, గిరిజన ప్రజా సమైక్య జిల్లా అధ్యక్షుడు భుక్యా సమీర్ నాయక్, రాష్ట్ర యువజన అధ్యక్షులు ఇస్లావత్ హనుమంతు నాయక్, బి వాసు నాయక్, గిరిజన సంఘాల నాయకులు తదితరులు ఆయనతో పాటు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *