రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జూలై, ఆగష్టు, సెప్టెంబరు నెలలలో వరదలు, ప్రకృతి విపత్తుల నిర్వహణ కోసం ప్రతిపాదిత పనుల విషయంలో సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. బుధవారం అమరావతీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రథాన కార్యదర్శి టీ ఆర్ 27 పై, సీసీఎల్ ఏ కమిషనర్ రీ సర్వే పై సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జెసి ఎస్ చిన్న రాముడు, డిఆర్వో టి. సీతారామ మూర్తి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జూలై నెలలో సంభవించి ఆకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిహారం ఎన్యుమారేషన్ చెయ్యడం జరిగిందని తెలిపారు. సెప్టెంబర్ నెలలో విజయవాడ వరద సమయంలో పునరావాస కార్యక్రమంలో భాగంగా ఆహారాన్ని, ఇతరములను తూర్పు గోదావరి జిల్లా నుంచి పంపడం జరిగిందనీ తెలిపారు. హార్టికల్చర్ పంట పరిహారాన్ని⁴ అందజేయడం జరిగిందని తెలిపారు. ఎర్ర కాలువ పనులకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు ద్వారా సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక సిద్ధం చేసి చేపట్టవలసిన పనులు పై ఈ ఎన్ సి కి ప్రతిపాదనలను పంపినట్లు తెలిపారు.
సీసీఎల్ఏ కమిషనర్ జి. జయలక్ష్మి రీ సర్వే, సభల నిర్వహణా, అర్జీలు పరిష్కార స్థాయి పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ చిన్న రాముడు వివరాలు తెలియ చేస్తూ, జిల్లాలో రెవిన్యూ గ్రామాల పరిథిలో రెవిన్యూ సదస్సు లని నిర్వహించడం జరిగిందన్నారు. బుధవారం తో అన్ని గ్రామాలలో రెవిన్యూ సదస్సు నిర్వహించినట్లు తెలియ చేశారు. నిన్నటి వరకు మొత్తం 3180 అర్జీలను స్వీకరించడం జరిగిందనీ వాటిలో 1227 పరిష్కరించినట్లు పేర్కొన్నారు. కొవ్వూరు డివిజన్ పరిధిలో 1708 కి గాను 834, రాజమండ్రీ డివిజన్ పరిధిలో 1442 కి గాను 393 అయినట్లు తెలియ చేశారు. జిల్లా కలెక్టర్ వారి అధ్వర్యంలో, వారీ ఆదేశాలను అనుసరించి జవాబుదారితనం తో కూడిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రెవిన్యూ విభాగం ద్వారా అందచేసే సేవలను ఎటువంటి రుసుము వసూలు చెయ్యకుండా పరిష్కారం చెయ్యడం జరిగిందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డి ఆర్వో టి సీతారామ మూర్తి , కలక్టరేట్ పరిపాలన అధికారి ఎమ్డి ఆలీ, డిప్యూటి తహసిల్దార్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News