Breaking News

జాతీయ హ్యాండ్ బాల్ పోటీలకు ఏపీ బాలికల బృందం

-అభినందించిన సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి. శ్రీనివాసరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ లో ఈ నెల 10 నుండి 14 వరకు జరిగే 68వ జాతీయ హ్యాండ్ బాల్ అండర్ – 17 బాలబాలికల టోర్నమెంట్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 16 మంది విద్యార్థినిలు ఎంపికయ్యారు. క్రీడాకారిణుల బృందం బుధవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో ఎస్పీడీ బి. శ్రీనివాసరావు IAS., ని కలిశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినిలకు ఆల్ ది బెస్ట్ చెబుతూ చక్కని ప్రతిభ చూపి, మన రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీడీ ఎం.ఆర్.ప్రసన్నకుమార్, ఎస్జీఎఫ్ రాష్ట్ర అసిస్టెంట్ కార్యదర్శి కె రాధాకృష్ణ , కోచ్ ఎల్ దుర్గారావు, హ్యాండ్ బాల్ క్రీడాకారుడు ఏ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఎంపికైన క్రీడాకారులు:
విజయవాడ పటమట కేబీసీ బాయ్స్ హైస్కూలుకు చెందిన G మహేశ్వరి, A. లావణ్య, పి ప్రణతి, జి లక్ష్మి, ఎన్.అలెక్స్ శృతి, శ్రీకాకుళం జిల్లా నుండి కె.రేవతి, జె.నీలిచంద్రిక, కె.వైశాలి, విజయనగరం నుండి ఎస్.నిత్యశ్రీ, బి. తేజస్విని, ప్రకాశం నుండి ఆర్.అనూష, ఎం.వెంకట అమూల్య, సీహెచ్. గుణ ప్రవళిక(పశ్చిమగోదావరి), టి. నక్షత్ర (అనంతపురం), షేక్ సమీరా (చిత్తూరు), కె.పల్లవి (వైయస్సార్ కడప) ఎంపికయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *