Breaking News

రహదారి నిర్మాణ పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ఏ డి బి) నిధులతో చేపట్టిన రహదారి పనులని త్వరితగతిన పూర్తి చేసే క్రమంలో ప్రభుత్వ, ప్రవేటు పరంగా సేకరణ ప్రక్రియ పై సమగ్రంగా వివరాలు అందచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు.

బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ , రెవిన్యూ అధికారులతో ఎడిబి రోడ్డు పనులపై సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ – రాజానగరం వరకూ నిర్మిస్తున్న ఎ డి బి రహదారి మార్గం పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకుని రావడం పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందనీ తెలిపారు. ఆ క్రమంలో రహదారి నిర్మాణ పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ప్రాజెక్ట్ అధికారిగా జాయింట్ కలెక్టర్, భూసేకరణ అధికారిగా రాజమండ్రీ ఆర్డీవో, ఎక్జిక్యూటివ్ ఏజెన్సీ గా రాష్ట్ర హై వే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రహదారివిస్తరణ కోసం మొత్తం 72.16 ఎకరాల భూమి సేకరణ చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఇందులో 57.69 ఎకరాలు ప్రవేటు భూమి సేకరించగా, తూర్పు గోదావరి జిల్లా లో 34.11 ఎకరాలు ఎక్జిక్యూటివ్ ఏజెన్సీ కి అప్పగించడం జరిగిందన్నారు. మిగిలిన వాటికి చెంది జిల్లా పరిథిలో ఉన్న ప్రభుత్వ భూమి ఎంత, అందులో ఆక్రమిత భూముల, నిర్మాణాలు చెందిన సమగ్ర నివేదిక అంద చెయ్యాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా అక్రమాలకు పాల్పడిన వారిని ఖాళీ చేయించే దిశలో చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, ఎక్జిక్యూటివ్ ఏజెన్సీ ఈ ఈ శ్రీకాంత్ , డి ఈ, రాజానగరం రంగంపేట తహసిల్దార్ లావణ్య , కే. అనసూయ లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *