-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ గురువారం ఉదయం లబ్బీపేట పరిసర ప్రాంతాలను పర్యటించి, జరుగుతున్న పన్నుల స్పెషల్ డ్రైవ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ విభాగం సిబ్బంది అనగా సచివాలయం అడ్వెన్స్ సెక్రటరీలు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వారి వారి పరిధిలో నూతనంగా నిర్మించిన భవనములకు అదనపు అంతస్తుల నిర్మాణం మరియు భవనము వాడుకములో మార్పులను గుర్తించి ఆ భవనముల ఇంటి పనులను క్రమబద్ధీకరించుట జరుగుచున్నదని. ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఇంకాను గుర్తించకుండా మిగిలిపోయిన భవనాలకు స్పెషల్ డ్రైవ్ చేపట్టుట నిర్ణయించారని. కావున ఎడ్మిన్ సెక్రటరీలు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు గుర్తించిన నూతన భవనంలకు ప్రజలు సహకరించి వారి ఆస్తి దస్తావేజుల నకళ్లను అందజేసి పనులను విధించుటకు మరియు గుర్తించని భవనముల యజమానులు స్వచ్ఛందముగా సంబంధిత సచివాలయంలో దరఖాస్తు చేసుకొని ఈ స్పెషల్ డ్రైవ్ ఉపయోగించుకోని, విజయవాడ నగర అభివృద్ధికి సహకరించవలసిందిగా కమిషనర్ కోరారు. ఈ పర్యటనలో డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు అడ్మిన్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.