Breaking News

రాజానగరం పీజీఆర్ఎస్ లో 54 అర్జీలు స్వీకరణ

-క్షేత్ర స్థాయి అధికారులు ప్రజలతో సమస్యలపై సానుకూలంగా స్పందించాలి
-క్షేత్ర స్థాయి సిబ్బంది పై ఆధారపడి విధుల నిర్వర్తించడం ఏమిటి..?
-ప్రతి సోమవారం కలెక్టరేట్ కు వస్తున్న అర్జీలు ఇందుకు నిదర్శనం
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేసి ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు.

సోమవారం రాజానగరం మండలం లో స్ధానిక ఎంపిడివో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పి జి ఆర్ ఎస్ కి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, మండల స్థాయి పి జి ఆర్ ఎస్ లో ప్రజల నుంచి రెవిన్యూ 30, పంచాయతి రాజ్ 11 , పోలీస్ 2, ఇతర శాఖలు 11 అర్జీలు స్వికరించడం జరిగిందన్నారు.

క్షేత్ర స్థాయి అధికారులు గ్రామ పంచాయతీ కార్యదర్శి, వి ఆర్ వో, సచివాలయం సిబ్బంది పై ఆధారపడి పనిచెయ్యడం జరుగుతోందని పేర్కొన్నారు. సచివాలయ సిబ్బంది అధికారులకి అదనపు మానవ వనరులు కింద వారి సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బాధ్యత వహించాల్సి అధికారులు కింద స్థాయి సిబ్బంది పై ఆధారపడడం ద్వారా మీ గుర్తింపు కోల్పోతారన్నారు. అధికారులు ఎవరి బాధ్యతలు వారూ గుర్తెరిగి పనిచేయాలని , లేని ఎడల ఈ పరిపాలనా యంత్రాంగం ఎందుకు అని ప్రశ్నించారు.

మండల స్థాయి పరిష్కారం అయ్యే అర్జీలు పరిష్కారం కోసం కలక్టరేట్ కు రావడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మీ వద్ద సమస్య పరిష్కారం కోసం రావడం జరిగినా, వాటికీ పరిష్కార మార్గం చూపలేకపోవడం వల్ల తన వద్దకు వస్తున్నట్లు తెలిపారు. ఇది మీ పనికి నిదర్శనం అన్నారు. ప్రజలు మీ నుంచి ప్రతిస్పందన కోరుకుంటున్నారని, బాధ్యత వహించాల్సి మీరు ఆమేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని మీ ద్వారా, కొన్ని ఇతర అధికారులతో సమన్వయం చేసుకోవడం ద్వారా, మరికొన్ని ఉన్నత అధికారుల ద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, తాహాసిల్దార్ జీవిఎల్ దేవి, డీఏల్ డివో పి.. వీణా దేవి, ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *