Breaking News

ఈ నెల 23,24,25 తేదీల్లో నాజ్ సెంటర్ రిజర్వాయర్ పరిధిలో త్రాగునీటి సరఫరాలో అంతరాయం…

-నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని 3 వంతెనల వద్ద సంగంజాగర్లమూడి నుండి నాజ్ సెంటర్ రిజర్వాయర్ కి త్రాగునీటి సరఫరా జరిగే 700ఎంఎం డయా సిఐ పైప్ లైన్ మరమత్తు పనులను ఈ నెల 23(గురువారం) ఉదయం సరఫరా అనంతరం చేపట్టడానికి జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారని, పనుల వలన 23 (గురువారం) ఉదయం నుండి 25 (శనివారం) ఉదయం వరకు త్రాగునీటి సరఫరాలో అంతరాయం కల్గుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పైప్ లైన్ మరమత్తు పనుల వలన నాజ్ సెంటర్ (ఎల్ఎల్ఆర్) రిజర్వాయర్ పరిధిలోని పొత్తూరివారి తోట, గుంటూరువారితోట, కొత్తపేట, రాజాగారితోట, సాంబశివరావుతోట, రామిరెడ్డితోట, ప్రకాష్ నగర్, రైల్ పేట, గణేష్ రావు పేట, అహ్మద్ నగర్, శీలంవారి వీధి, లాలాపేటలో కొంత ప్రాంతం, పట్నంబజార్ లోని కొంత ప్రాంతం, చౌత్ర సెంటర్ లోని కొంత ప్రాంతం, ఏటుకూరు మెయిన్ రోడ్, చిన్న బజార్ లోని కొన్ని ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాలో అంతరాయం కల్గుతుందని, తిరిగి 25 సాయంత్రం పాక్షింగా, 26వ తేదీ నుండి యధావిధిగా సరఫరా జరుగుతుందని తెలిపారు. కావున నగర ప్రజలు తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకొని, నగరపాలక సంస్థకు సహకరించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *