Breaking News

జిల్లా సమీక్షా కమిటీ సమావేశం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన ఈ నెల 28 వ తేది ( మంగళవారం ) ఉదయం 10.30 గంటలకు కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి నేడొక ప్రకటనలో పేర్కొన్నారు. సమావేశంలో అజెండా అంశాలైన వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు , పరిశ్రమలు మరియు స్కిల్ , గుంటూరు నగరపాలక సంస్థ , యంటీయంసీ , హౌసింగ్ , డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ , మెడికల్ అండ్ హెల్త్ , విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖలపై సమీక్షించడం జరుగుతుంది. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి, ప్రజాప్రతినిధులు , అధికారులు సమావేశానికి హాజరు కానున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ పథకాలు బడుగు బలహీన వర్గాల అర్హులకు అందేలా, ఆర్థిక సామాజిక భద్రత, న్యాయం అందేలా పర్యవేక్షించే వేదిక…

-జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ ఎస్టీ ల సమస్యల పరిష్కారం కొరకు వారికి భరోసా కల్పించేలా ప్రభుత్వ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *