Breaking News

నగరంలో పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలి, పన్నుల వసూళ్ళలో నిర్లక్ష్యం వహించే కార్యదర్శులు మరియు ఆర్.ఐ ల పై చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలి, పన్నుల వసూళ్ళలో నిర్లక్ష్యం వహించే కార్యదర్శులు మరియు ఆర్.ఐ ల పై చర్యలు తప్పవని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ హెచ్చరించారు. బుధవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరం నందు రెవిన్యూ విభాగం అధికారులతో ఆస్తి పన్ను వసూళ్ళపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సదరు సమావేశంలో తొలుతగా సచివాలయాల వారీగా ఉన్న డిమాండ్ మరియు వసూళ్ళ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ, రాష్ట్రంలోనే గుంటూర్ నగర పాలక సంస్థ రెవిన్యూ వసూళ్లలో వెనుకబడి ఉన్నదని, తదుపరి సమావేశం బుధవారం నిర్వహిస్తామని అప్పటికి ఉన్న పెండింగ్ బకాయిలలో 50 శాతం వసూళ్లు నిర్వహించకపోతే సంబంధిత సిబ్బంది పై చర్యలు తీసుకొనుట జరుగుతుందన్నారు. రెవిన్యూ వసూళ్ళకు సంబంధించి కార్యదర్శులకు, ఆర్.ఐ లు రోజు వారి టార్గెట్ లను ఫిక్స్ చేసి, ప్రతి రోజు వాటి పై సమీక్ష ర్వహించాలని డిప్యూటి కమీషనర్లను ఆదేశించారు. తమ రోజు వారి పర్యటనలో చాలా ప్రాంతాలలో అన్ అస్సేస్మేంట్లు మరియు అండర్ అస్సేస్మెంట్లు గుర్తిస్తున్నామని కార్యదర్శులు ఫీల్డ్ విజిట్ కి వెళ్లి అన్ అస్సేస్మేంట్లు మరియు అండర్ అస్సేస్మెంట్లను గుర్తించి అస్సేస్మేంట్లు లేని వాటికి అస్సేస్మెంట్లు వేయాలన్నారు. అంతేకాక మొండి బకాయిలు ఉన్న ప్రాంతాలకు రెవిన్యూ అధికారులు మరియు డిప్యూటి కమీషనర్లు కూడా వెళ్లి కలెక్షన్స్ నిర్వహించాలన్నారు. వి.యల్.టి మరియు వాటర్ చార్జెస్ వసూళ్లు కూడా వేగవంతం చేయాలని, వీటి వసూళ్ళకు ప్రత్యేక డ్రైవ్ లను ఏర్పాటు చేయాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు. వి.యల్.టి మరియు వాటర్ చార్జెస్ వసూళ్ళ పై రెవిన్యూ అధికారులు ఆర్.ఐ లతో మరియు కార్యదర్శులతో ప్రతి రోజు సమావేశాలు నిర్వహించాలన్నారు. వాటర్ చార్జెస్ చెల్లించని వారి గృహాలకు వాటర్ కనెక్షన్లను కట్ చేయాలని కార్యదర్శులను ఆదేశించారు. షాప్ లీజులు పూర్తైన వాటికి నిబంధనల ప్రకారం లీజులను పునరుద్దరించాలని, అలాగే 25 సంవత్సరాలు పై బడిన వాటికి టెండర్ ప్రక్రియ నిర్వహించాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు. సదరు సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటి కమిషనర్లు డి. శ్రీనివాసరావు, సి.హెచ్. శ్రీనివాసరావు, సెక్రటరీ పి. శ్రీనివాసరావు, ఆర్.ఓ లు, ఆర్.ఐ లు, కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *