Breaking News

స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్ల పాత్ర చాలా బాధ్యతాయుతమైనది ఎంవి ఇన్స్పెక్టర్ యంవి నారాయణ రాజు

-స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్ల పాత్ర చాలా బాధ్యతాయుతమైనదని, విద్యార్థులను పాఠశాలలకు సురక్షితంగా తీసుకెళ్ళడంలో డ్రైవర్లు బాధ్యత ప్రముఖమని ఎంవిఐ నారాయణ రాజు కొనియాడారు

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా గురువారంనాడు జగ్గయ్యపేట వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లోని ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లతో జగ్గయ్యపేట పట్టణంలోని ప్రాంతీయ రవాణాశాఖ యూనిట్ కార్యాలయం వద్ద రోడ్డు భద్రత పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మోటార్ వాహన తనిఖీ అధికారులు యంవిఎన్ నారాయణరాజు, కె జయచంద్ర పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంవిఎన్ నారాయణరాజు మాట్లాడుతూ స్కూలు బస్సులు నడిపే డ్రైవర్లు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, బస్సుల కండిషన్ లను ఎప్పటికప్పుడు గమనించుకోవాలని ఆయన అన్నారు. బస్సుల కండిషన్ లతో పాటు ఆరోగ్యంను కూడా కాపాడుకోవలన్నారు. క్రమం తప్పకుండా ప్రతి ఆరునెలలకొకసారి కంటి పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమన్నారు. డ్రైవింగ్ పట్ల చేసే చిన్నచిన్న పొరపాట్లు పెద్దపెద్ద ప్రమాదాలకు దారితీస్తాయన్నారు. విద్యార్థులు స్కూల్ బస్సులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు డ్రైవర్లు గమనించుకుంటూ బస్సులను నడపాలన్నారు. కాలం తీరిన బస్సులలో స్కూలు పిల్లలను తరలించొద్దని ఆయన కోరారు. స్కూల్ బస్సుల పట్ల భద్రతా ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు.
బస్సులు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచనలను నారాయణరాజు డ్రైవర్లకు వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *