Breaking News

హెల్త్ ఎడ్యుకేషన్ డైరీ మరియు క్యాలెండరు ఆవిష్కరించిన జోన్ 2 రీజనల్ డైరెక్టర్ పద్మ శశిధర్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు అవగాహన కల్పించి వ్యాధులను అరికట్టడంలో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాలలో ఆరోగ్య విద్య ఎంతో అవసరమని రీజినల్ డైరెక్టర్ పద్మ శశిధర్ అన్నారు..

గురువారం స్థానిక జిల్లా జోన్ – 2 ప్రాంతీయ సంచాలకులు వారి కార్యాలయంలో జోన్ 2 రీజినల్ డైరెక్టర్ పద్మ శశిధర్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ మరియు క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో ఆరోగ్య విద్య ద్వారా ముందస్తుగానే ప్రజలకు అవగాహన కలిగించడం ద్వారా వ్యాధులను అరికట్టవచ్చని ప్రతి జాతీయ ఆరోగ్య కార్యక్రమాలలో ఈ ఆరోగ్య విద్య ఎంతో అవసరమని తెలియజేశారు.

అదే విధంగా డిప్యూటీ డైరెక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ ఆరోగ్య శాఖలో IEC మెటీరియల్స్ ప్రింట్ చేయడంలో మీడియా ఆఫీసర్స్ యొక్క పాత్ర ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నదని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ డెమో సత్యకుమార్ నల్లూరి, సీనియర్ అసిస్టెంట్ సాయి, ప్రభుత్వ మెడికల్ కాలేజీ SPM స్టాఫ్, లెక్చరర్ ఇన్ సోషల్ సైన్సెస్ (LSS) అయిన పేరయ్య శాస్త్రి, ప్రసన్న, శ్రీనివాసమూర్తి తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *