Breaking News

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకునిపై దాడి బాధాకరం

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మల్లాది విష్ణు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు రాష్ట్రాలలో ఆలయాలు, హిందూమతానికే కాకుండా, అర్చకులకు రక్షణ లేకుండా పోతోందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకునిపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దేవుడి సేవలో ఉన్న అర్చకునిపై దాడికి తెగించడం దారుణమని.. సమాజం బాగుండాలని నిత్యం కైంకర్యాలు, పూజలు నిర్వహించి దైవ దూతలుగా భావించే అర్చకులపై వరుస దాడులు కలచివేస్తున్నాయన్నారు. చిలుకూరు ఘటనను ప్రతిఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్చకులకు సరైన రక్షణ కల్పించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *