Breaking News

కోర్టు భవనం కొరకు రెవెన్యూ అధికారులతో స్థలము పరిశీలన

-తిరుపతి దామినేడు వద్ద కోర్టు భవనం కొరకు రెవెన్యూ అధికారులతో కలసి స్థలమును పరిశీలించిన ఆం.ప్ర రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్  మరియు చిత్తూరు ఉమ్మడి జిల్లా పోర్ట్ ఫోలియో అడ్మినిస్ట్రేషన్ హైకోర్టు జడ్జి బి. కృష్ణ మోహన్ 

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం మధ్యాహ్నం తిరుపతి దామినేడు వద్ద కోర్టు భవనం కొరకు గౌ.ఆం.ప్ర రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు చిత్తూరు ఉమ్మడి జిల్లా పోర్ట్ ఫోలియో అడ్మినిస్ట్రేషన్ హైకోర్టు జడ్జి బి. కృష్ణ మోహన్ జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, రెవెన్యూ డివిజనల్ అధికారి రామ్మోహన్ వెంట రాగా స్థలమును పరిశీలించారు. అనంతరం తిరుపతి రైల్వే స్టేషన్ నందు ఆం.ప్ర రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కి మరియు చిత్తూరు ఉమ్మడి జిల్లా పోర్ట్ ఫోలియో అడ్మినిస్ట్రేషన్ హైకోర్టు జడ్జి బి. కృష్ణ మోహన్ కి తిరుపతి థర్డ్ ఎడిజే ఎం. గుర్నాథ్ , ప్రోటోకాల్ జడ్జి కోటేశ్వర రావు, కోర్టు సూపరింటెండెంట్ ధనుంజయ్ నాయుడు తదితరులు వీడ్కోలు పలికారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *