Breaking News

ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాలి..

– ప్ర‌త్యేక బృందాలు స‌మ‌న్వ‌యంతో ప‌నియాలి
– నిష్ప‌క్ష‌పాతం, నిబ‌ద్ధ‌తతో ఎన్నిక‌ల విధులు నిర్త‌ర్తించాలి
– ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మ‌డి కృష్ణా-గుంటూరు జిల్లాల శాస‌న మండ‌లి ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల పోలింగ్ ఈ నెల 27న జ‌రుగుతుంద‌ని, జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి (ఎంసీసీ)ని నిష్ప‌క్ష‌పాతంగా, స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లుచేయ‌డంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.
గురువారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య హాల్‌లో ఎంసీసీతో పాటు ఫ్ల‌యింగ్ స్వ్కాడ్ టీమ్స్ (ఎఫ్‌ఎస్‌టీ), స్టాటిక్ స‌ర్వైలెన్స్ టీమ్స్ (ఎస్ఎస్‌టీ), వీడియో స‌ర్వైలెన్స్ టీమ్స్ (వీఎస్‌టీ), వీడియో వ్యూయింగ్ టీమ్స్ (వీవీటీ) స‌మావేశం జ‌రిగింది. జిల్లాలో ఎన్నిక‌ల కోడ్ అమ‌లు స‌ర‌ళితో పాటు ఫిర్యాదుల ప‌రిష్కారం, రిపోర్టింగ్ మేనేజ్మెంట్‌, ఎల‌క్ష‌న్ సీజర్స్ త‌దిత‌రాలతో పాటు ఇక‌పైనా కోడ్ పటిష్ట అమలుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై అధికారుల‌కు మార్గ‌నిర్దేశం చేశారు. న‌గ‌దు, మ‌ద్యం, విలువైన లోహాలు త‌దిత‌రాల అక్ర‌మ ర‌వాణాకు అడ్డుక‌ట్ట వేసే విష‌యంలో 11 చెక్‌పోస్టుల సిబ్బంది, 24 ఫ్ల‌యింగ్ స్క్వాడ్‌లు, 11 స్టాటిక్ స‌ర్వైలెన్స్ బృందాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. పోలీస్‌, ఎక్సైజ్‌, ఐటీ, ఫారెస్ట్‌, బ్యాంకింగ్ త‌దిత‌ర ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌న్నారు. ప్ర‌త్యేక బృందాలు ప్ర‌తిరోజు జిల్లాస్థాయి నోడ‌ల్ అధికారికి నిర్దేశ ఫార్మాట్ల‌లో నివేదిక‌లు పంపించాల్సి ఉంటుంద‌న్నారు. జిల్లాస్థాయి కాల్ సెంట‌ర్‌కు వ‌చ్చే ఫిర్యాదులు పైనా త్వ‌రిత‌గ‌తిన క్షేత్ర‌స్థాయి బృందాలు స్పందించాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. చెక్‌పోస్టుల వ‌ద్ద ఉండే స్టాటిక్ స‌ర్వైలైన్స్ బృందాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ఒక‌వైపు నియ‌మ నిబంధ‌న‌ల‌ను తు.చ‌. త‌ప్ప‌కుండా పాటిస్తూనే మ‌రోవైపు ప్ర‌జ‌ల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా చూడాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు.
స‌మావేశంలో డీఆర్‌వో, స‌హాయ రిట‌ర్నింగ్ అధికారి ఎం.ల‌క్ష్మీ న‌ర‌సింహం, ఎంసీసీ నోడ‌ల్ అధికారి కె.శ్రీనివాస‌రావు, జిల్లా సహకార అధికారి ఎస్‌.శ్రీనివాస‌రెడ్డి, క‌లెక్ట‌రేట్ ఎల‌క్ష‌న్ సెల్ సూప‌రింటెండెంట్ చంద్ర‌మౌళి త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *