Breaking News

రవాణావాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు నిబంధనలు తప్పక పాటించాలి

-మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ యం వి నారాయణ రాజు

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
సరుకు రవాణా చేసే వాహన డ్రైవర్లు భద్రత నియమాలు తప్పక పాటించాలని, ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలు తీయొద్దని మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ యం వి నారాయణ రాజు అన్నారు.

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా కెసిపి సిమెంట్ ప్రాంగణంలో గురువారం నాడు కెసిపి సిమెంట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు మరియు ఉద్యోగులు తో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కెసిపి ప్రాంగణంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో జగ్గయ్యపేట మోటార్ వెహికల్స్ఇన్స్పెక్టర్ నారాయణ రాజు మాట్లాడుతూ వాహనాల్లో పరిమితికి మించి బరువును ఎక్కించరాదని, మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ఆయన అన్నారు. సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపొద్దని, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వలన ఏకాగ్రత కోల్పోయి ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. దూరపు ప్రాంతాలకు ప్రయాణించే డ్రైవర్లు మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవాలన్నారు. వాహనాలను క్రాస్ చేసేటప్పుడు, టర్నింగులు తిరిగేచోట జాగ్రత్తలు వహించాలన్నారు. రోడ్లపై ఉండే ట్రాఫిక్ గుర్తులను గమనించుకుంటు వాహనాలను నడపాలన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోతే జరిగే ప్రమాదాల్లో డ్రైవర్లకు వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు జరిగే అనర్ధాలను గుర్తించుకోవాలని ఎం వి ఐ నారాయణరాజు సూచించారు.

ఈ కార్యక్రమంలో కెసిపి ప్రతినిధులు జనరల్ మేనేజర్ మైన్స్ బి అనిల్ కుమార్, హ్యూమన్ రిసార్ట్స్ ఎన్ నాగేంద్ర కుమార్, హెచ్ ఓ డి ట్రాన్స్పోర్ట్ కేఎన్ కృష్ణారెడ్డి, డిప్యూటీ మేనేజర్ ట్రాన్స్పోర్ట్ ఎన్ శ్రీనివాసరావు తదితర కెసిపి ఉద్యోగ ప్రముఖులు సిబ్బంది ట్రాన్స్పోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *