Breaking News

జిల్లా కమిటీ సభ్యులుగా నియమితులైన నాయకులకు మల్లాది విష్ణు అభినందనలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులుగా నూతనంగా నియమితులైన యర్రగొర్ల శ్రీరాములు, ఓబిరెడ్డి వెంకటరామిరెడ్డి, గజ్జలకొండ వాసు, కంది వెంకట రమణారెడ్డి, వరికూటి నాగిరెడ్డి గురువారం వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సభ్యులకు మల్లాది విష్ణు తన అభినందనలు తెలిపారు. పార్టీ పటిష్టతకు పాటుబడే ప్రతీ కార్యకర్తకు దశలవారీగా సముచిత స్థానం కల్పిస్తామని మల్లాది విష్ణు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు. నూతనంగా ఎంపికైన సభ్యులకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. అనంతరం సభ్యులు పుష్పగుచ్ఛం అందించి మల్లాది విష్ణుని దుశ్శాలువతో ఘనంగా సన్మానించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *