Breaking News

స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్రా లక్ష్యంతో వ్యర్థాల నుంచి సంపద సృష్టి దిశగా అడుగులు వేద్దాం

-కలెక్టరేట్ లో 3 వ శనివారం స్వచ్ఛంద్ర కార్యక్రమం
-జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పిలుపు ఇచ్చారు. శనివారం స్థానిక బొమ్మూరు కలెక్టరేట్ లో నిర్వహించిన స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేసీ పాల్గొన్నారు. తొలుత కార్యక్రమం లో భాగంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కలెక్టీరేట్ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జేసి చిన్న రాముడు మాట్లాడుతూ, ఒక మంచి ఉద్దేశ్యంతో అధికారులను, సిబ్బందిని, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో కార్యాలయంలో, ఆఫీసుల్లో పెండింగ్ ఫైల్స్ పరిష్కారం అయ్యేలా చూడాలని కోరారు. ఫైల్స్ క్లియర్ చెయ్యడం ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించాలని సూచించారు. ప్రతి మూడో శనివారం తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. తడి పొడి చెత్త సేకరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని, ఆమేరకు ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి. శాంతమణి కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వి. శాంతమణి, సీపీవో ఎల్ .అప్పలకొండ, డి ఎల్ డివో పి. వీణా దేవి, కలెక్టరేట్ ఏవో ఎండీ ఎండీ ఆలీ , సంక్షేమ శాఖల అధికారులు ఎం ఎస్ శోభ రాణి, కే ఎస్ జ్యోతి, బి. శశాంక , సందీప్, ఈవోపిఆర్డీ ఆర్మ్ స్ట్రాంగ్, డివిజనల్ పిఆర్వో లక్ష్మణ చార్యులు, కలెక్టరేట్, ఇతర శాఖల అధికారులు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *