గోకవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్రా లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ తమ వంతు గా భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలువు నిచ్చారు. శనివారం సాయంత్రం గోకవరం మండలంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో డ్వామా పీడీ ఏ. నాగమహేశ్వర్ తో పాల్గొని సోప్ పిట్స్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో 3650 సోప్ పిట్స్ నిర్మాణ పనులను ఉపాధిహామీ పథకం కింద చేపట్టడం జరిగిందని తెలిపారు. ఒక్కో సోప్ పిట్ నిర్మాణానికి వ్యయం అయ్యే రూ.6000 లతో ఉపాధి హామీ పథకం మెటీరియల్స్ కాంపోనెంట్ ద్వారా సమకూర్చి గృహ లబ్ధిదారుల స్వంత గృహాల్లో ఏర్పాటు చేయడం జరుగుతున్నట్లు తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర మిషన్ కార్యక్రమం లో తూర్పు గోదావరి జిల్లా కు మూడో ర్యాంకు రావడం జరిగిందని, ఇదే స్పూరితో రానున్న రోజుల్లో ప్రథమ స్థానం కోసం అందరం కలిసి కృషి చేద్దామని పిలుపు ఇచ్చారు. ప్రతి ఇంటికి బాత్రూం నిర్మిద్దాం.. ఇంటి నుంచి బయటకు వెళ్లి నీటిని వృధా చేయకుండా రీ సైకిల్ చేసి ప్రకృతి అందించిన సహజ వనరులను కాపాడుకోవాలి అని సూచించారు.
Prajavartha Online Telugu News