గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరిగేలా ప్రజారోగ్య కార్యదర్శులు భాధ్యత తీసుకోవాలని, రోడ్ల మీద, కాల్వల్లో వ్యర్ధాలు వేసే వారిని గుర్తించి అపరాధ రుసుం విధించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శుక్రవారం కమీషనర్ గారు తమ రోజు వారీ పర్యటనలో భాగంగా సాయి నగర్, అంకిరెడ్డిపాలెం, ఏటి అగ్రహారం, శ్రీరాం నగర్ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్య కార్మికుల రేషనలైజేషన్ పూర్తి అయినందున వార్డ్ సచివాలయాల వారీగా పారిశుధ్య పనులను డ్రైవ్ మోడ్ లో చేపట్టాలన్నారు. చెత్త సేకరణ, డ్రైన్ల శుభ్రంపై ఫిర్యాదులు రావాడానికి వీలు లేదని, అందుకు తగిన విధంగా ఉదయం ఇంటింటి చెత్త సేకరణ, మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్ ద్వారా పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. కార్యదర్శులు, కార్మికులు అత్యవసరం అయితే తప్ప ముందస్తు అనుమతి లేకుండా సెలవులు తీసుకోకూడదన్నారు. అంకిరెడ్డిపాలెంలో ప్రజలతో స్థానిక సమస్యలపై మాట్లాడి, ఆయా సమస్యల పరిష్కారానికి విభాగాల వారీగా ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. ఏటి అగ్రహారం రిజర్వాయర్ పంప్ హౌస్ ని పరిశీలించి,ర్ రానున్న వేసవి దృష్ట్యా అన్ని మోటార్లు వర్కింగ్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రిజర్వాయర్ పరిధిలో పైప్ లైన్ లీకుల మరమత్తులు పూర్తి చేయాలని ఆదేశించారు.
పర్యటనలో డిఈఈలు శ్రీనివాస్, మధుసూదన్, ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News