Breaking News

హాస్పిటల్స్, కమర్షియల్ భవనాలు సెల్లార్ లను పార్కింగ్ కోసమే వినియోగించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని హాస్పిటల్స్, కమర్షియల్ భవనాలు సెల్లార్ లను పార్కింగ్ కోసమే వినియోగించాలని, ఇతర అవసరాలను వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో సెల్లార్ల వినియోగం, ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నియంత్రణ అంశాలపై నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారులు, ట్రాఫిక్ అధికారులు, ఐఎంఏ ప్రతినిధులతో సంయుక్త సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండు ప్రాంతాలైన హాస్పిటల్స్ రోడ్డు మరియు కమర్షియల్ భవనాలలో పార్కింగ్ కోసం కేటాయించిన సేల్లార్లను వేరే అవసరాలకు వాడుతూ, వాహనాలను రోడ్లపై పార్కింగ్ చేయుట వలన రోడ్లపై ట్రాఫిక్ నకు తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు. ఈ సమస్యను అధిగమించాలంటే నగర పాలక సంస్థ అధికారులు ట్రాఫిక్ పోలీసులతో కో ఆర్డినేట్ చేసుకొని సేల్లార్లను ఖాళీ చేయించి, సదరు ప్రాంతాలను పార్కింగ్ కొరకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమైన సిబ్బందిని మరియు వాహనాలను సమకూర్చుకోవాలన్నారు. అంతేకాక చుట్టుగుంట ప్రధాన రహాదారి నుండి పేరేచర్ల వరకు రోడ్డు ఇరువైపులా ఆక్రమణలకు గురై ఉన్నదని, ఆ రోడ్డు తో పాటు ప్రధాన రహదారుల మార్జిన్లు ఆక్రనలకు గురైన వాటిని గుర్తించి వెంటనే సదరు ఆక్రమణలను తొలగించి మరల ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. గుంటూరు నగరంలో ఆర్.టి.సి బస్టాండ్ వద్ద బస్సులను యద్దేచ్చగా ట్రాఫిక్ నకు అంతరాయం కలిగే రోడ్లపై పార్కింగ్ చేస్తున్నారని, బస్సులను రోడ్లపై పార్కింగ్ చేయకుండా ఆర్.టి.సి ఆర్.యం లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరించుటకు సిటీ ప్లానర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయాలని, సదరు కమిటీలో పోలీస్ డిపార్టుమెంటు, సీనియర్ సిటిజెన్ అసోసియేషన్, రేట్ పెయర్స్ అసోసియేషన్,మెడికల్ షాప్స్ ఓనర్స్, ఐఎంఏ మరియు బిల్డింగ్ అసోసియేషన్ తో ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్రమబద్దీకరణకు వారి సూచనలు సలహాలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో డిసిపి సూరజ్ కుమార్, ఏసిపి రెహ్మాన్, తూర్పు ట్రాఫిక్ సిఐ అశోక్ కుమార్, ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ సుబ్బారాయుడు, డాక్టర్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *