Breaking News

సర్వేలను సకాలంలో పూర్తి అయ్యేలా నోడల్ అధికారులు పర్యవేక్షణ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో వార్డ్ సచివాలయాల వారీగా ప్రభుత్వ ప్రాధాన్యత సర్వేలను సకాలంలో పూర్తి అయ్యేలా నోడల్ అధికారులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. శుక్రవారం సర్వేల వేగవంతంపై నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నోడల్ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రాధాన్యత సర్వేలైన మిస్సింగ్ సిటిజన్, జియో కోఆర్డినేట్, నాన్ రెసిడెంట్ ఏపి లను త్వరగా పూర్తి చేయడానికి వార్డ్ సచివాలయాల వారీగా యాక్షన్ ప్లాన్ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఈ నెల 27న జరగనున్న కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఓటింగ్ కి సంబందించి ఓటు హక్కు వినియోగంపై అవగాహన కోసం శనివారం జరిగే స్వీప్ ర్యాలీలో, అనంతరం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే సమావేశంలో సచివాలయ కార్యదర్శులందరూ పాల్గొనేలా నోడల్ అధికారులు భాధ్యత తీసుకోవాలన్నారు.
సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, పి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, నోడల్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *