Breaking News

రాజమండ్రి- విజయవాడ- శ్రీశైలం మూడు రోజుల (1D/2N) టూర్ ప్యాకేజీ

-రూట్ మ్యాప్: రాజమండ్రి విజయవాడ శ్రీశైలం తిరిగి రాజమండ్రి.
-సందర్శించే పుణ్యక్షేత్రాలు:
-భ్రమరాంబిక దేవి ఆలయం (శక్తి పీఠం) శ్రీశైలం.
-శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం (జ్యోతిర్లింగం), శ్రీశైలం.
-శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయం
-శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం
-ప్యాకేజీ ధర పెద్దలకు రాజమండ్రి నుంచి.. రు. 4360/-లు. పిల్లలు రు. 3490/- విజయవాడ నుంచి రు. 3490/-లు. పిల్లలు రు. 2550/-
-పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు సిహెచ్ పవన్ కుమార్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో  18 సీట్లు గల మినీ వాహనం రాజమండ్రి నుండి విజయవాడ మీదుగా శ్రీశైలం వరకు టూరిస్టులు దైవ దర్శనం కొరకు ప్రత్యేక ప్యాకేజీ నిర్వహిస్తున్నామని పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు సిహెచ్ పవన్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో  తెలిపారు.

సందర్శించే పుణ్యక్షేత్రాలు:
భ్రమరాంబిక దేవి ఆలయం (శక్తి పీఠం) శ్రీశైలం, శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం (జ్యోతిర్లింగం), శ్రీశైలం,
శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయం,
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం
సందర్శించి తిరిగి రాజమండ్రి చేరుకుంటారని తెలిపారు.

టూరిస్టులు పర్యటనలో భాగంగా వాహనం సాయంత్రం నాలుగు గంటలకు రాజమండ్రి పర్యాటకశాఖ కార్యాలయం నుండి బయలుదేరి రాత్రి 9 గంటలకు
విజయవాడ హరిత బెర్మ్ పార్క్ కు చేరుకొని అక్కడ యాత్రికులను పికప్ చేసుకోవడం జరుగుతుంది, అనంతరం రాత్రి 10 గంటలకు విజయవాడ నుండి బయలుదేరి..

రెండో రోజు ఉదయం ఎనిమిది గంటలకు శ్రీశైలం చేరుకుంటుందన్నారు.
అనంతరం భ్రమరాంబిక దేవి ఆలయం (శక్తి పీఠం) శ్రీశైలం, శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం (జ్యోతిర్లింగం), శ్రీశైలం,
శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయం,
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం
సందర్శించి తదుపరి రాత్రి 10 గంటలకు త్రిపురాంతకం నుండి విజయవాడ బయలుదేరుతుంది.

మూడో రోజు మధ్యాహ్నం రెండు గంటలకు విజయవాడ చేరుకొని అక్కడ యాత్రికులను దించి సాయంత్రం ఐదు గంటలకు రాజమండ్రి చేరుకోవడం జరుగుతుందని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.

ఈ పర్యటనలో మొత్తం 900 కి. మీ. ఉంటుందని, ఒక్కొక్క టూరిస్ట్ కు
ప్యాకేజీ ధర పెద్దలకు రాజమండ్రి నుంచి.. రు. 4360/-లు. పిల్లలు రు. 3490/-  విజయవాడ నుంచి రు. 3490/-లు. పిల్లలు రు. 2550/- ఉంటుందని ఆయన తెలిపారు

దైవ దర్శనానికి వెళ్లేటప్పుడు ఒక మహిళా భక్తురాలు చీర లేదా చుడీదారు చున్నీతో ధరించవచ్చు. అయితే ఒక పురుష భక్తుడు దోతీ లేదా లుంగీని ఉత్తరీయం లేదా కుర్తా- పైజామాతో ధరించవచ్చుని,

ఏదైనా దేవాలయాల వద్ద టాన్సరింగ్ ఛార్జీలు, ఏదైనా ఉంటే మార్గంలో ఆహారం & మొదలైనవి పర్యాటకులు (లు) మాత్రమే భరించాలన్నారు.

బుకింగ్ కోసం దయచేసి IRO, AP టూరిజం: 9848629341ను సంప్రదించవలననే ఆయన ఆ ప్రకటనలో కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *