-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి హెచ్చరిక
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ చిన్న తరహా ఖనిజ నియమావళి, 1966 ప్రకారం గనులు భూగర్భ శాఖ వారి అనుమతి లేకుండా ఏ వ్యక్తి క్వారీ నిర్వహణ చేపట్టరాదు మరియు అనుమతి రవాణా పత్రము లేకుండా ఖనిజ రవాణా నిర్వహించకూడదు. నియమ ఉల్లంఘన చేసిన వారు శిక్షార్హులని, అటువంటి ఉల్లంఘన కు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ఒక ప్రకటన లో హెచ్చరించారు.
క్వారీ అనుమతులు పొందుటకు విధివిధానాలు :
* క్వారీ లీజు/తాత్కాలిక పర్మిట్ పొందుట కోసం దరఖాస్తును www.mines.ap.gov.in ద్వారా పేరు, చిరునామా, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, సెల్ నంబర్ మొదలైన వివరాలను మరియు దరఖాస్తు చేసిన ప్రాంత వివరాలను, సర్వే నంబర్, గ్రామం, మండలం & విస్తీర్ణం, స్కెచ్ (JPG), డాక్యుమెంట్లు (JPG) మొదలైన వాటిని నమోదు చేసి పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి.
* తక్షణ లేదా సకాలంలో అవసరాలను తీర్చడానికి, సీనరేజ్ రుసుము, DMF & MERIT, అదనపు పరిగణన మొత్తం, పర్మిట్ జారీ చేయడానికి పరిగణించబడే ప్రాంతానికి పేర్కొన్న ప్రీమియం మొత్తం మరియు నియమాలలో పేర్కొన్న ఇతర వర్తించే పన్నులు మరియు సెస్‌లను ముందుగానే చెల్లించడం ద్వారా క్వారీ కార్యకలాపాలను నిర్వహించడానికి తాత్కాలికపర్మిట్ ద్వారా అనుమతించబడును.
* క్వారీ లీజు మంజూరు ప్రక్రియలో బాగంగా సంబంధిత తహశీల్దార్ నుండి నిరభ్యంతర ధృవీకరణ పత్రం పొందవలెను. తదుపరి ఖనిజ లభ్యతను నిర్ధారించడానికి క్షేత్ర తనిఖీ నిర్వహించబడుతుంది.
* దరఖాస్తుదారు సంబంధిత అధికారుల నుండి మైనింగ్ ప్లాన్ ఆమోదం, పర్యావరణ అనుమతి (EC ), మరియు కాలుష్య నియంత్రణ మండలి నుండి కార్యకలాపాలకు సమ్మతి (CTE & CTO) వంటి చట్టబద్ధమైన అనుమతులను పొందాలి.
* అయినప్పటికీ MO&EF శాఖ S.O. 1224(E), తేదీ 28.03.2020 ద్వారా పర్యావరణ అనుమతుల నుండి క్రింద తెల్పిన కొన్ని పనులను మినహాయించడమైనది.
* 1. గ్రామ చెరువులు లేదా ట్యాంకుల పూడిక తీయడం, గ్రామ రోడ్లు, చెరువులు లేదా గట్ల నిర్మాణం- MGNREGA లో చేపట్టబడే, ఇతర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు మరియు సమాజ పనులు కొరకు
2. నీటిపారుదల లేదా తాగునీటి ప్రయోజనం కోసం బావులు తవ్వడం
3. భవనం కోసం పునాది తవ్వడం.
4. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)వారి రోడ్డు వర్క్ నిమిత్తం వర్క్ ఆర్డర్ తేదీ 21.03.2024లోపు మంజూరు చేసిన యెడల తాత్కాలిక పర్మిట్ పొందుట కోసం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ మినహాయించబడును.
* రైతులు వ్యవసాయం కొరకు పంట భూములలో మట్టిని చదును చేసుకొనుటకు శాఖ పరమయిన అనుమతులు అవసరం లేదు.
కానీ సదరు త్రవ్విన మట్టిని అమ్మకము లేదా రవాణా చేయవలెనన్న ఆంధ్రప్రదేశ్ చిన్న తరహా ఖనిజ నియమావళి, 1966 ప్రకారం గనులు భూగర్భ శాఖ వారి అనుమతితప్పనిసరి.
* దరఖాస్తుదారు చట్టబద్దమైన అనుమతులను పొంది మందస్తూ సీనరేజ్ రుసుము, DMF & MERIT, అదనపు పరిగణన మొత్తం చెల్లింపులు చేసి, గనుల శాఖ ఖనిజ రవాణా పత్రము పొందిన పిదప మాత్రమే అనుమతించిన లీజు ప్రాంతం నుండి ఖనిజమును త్రవ్వి రవాణా చేయవలెను.
* చిన్న తరహా ఖనిజ నియమావళి, 1966 నిబంధనలకు విరుద్దంగా ఖనిజ త్రవ్వకాలు లీజు పొందిన ప్రాంతంలో గుర్తించిన యెడల లీజుదారుని పై చర్యలు తీసుకోబడతాయి. అనుమతి లేకుండా జిరాయితీ లేదా పట్టా భూములలో ఖనిజ త్రవ్వకాలు గుర్తించిన యెడలభూమి యజమాని పై చర్యలు తీసుకోబడతాయి.
* కావున జిల్లా పరిధిలో అనుమతి లేకుండా గ్రావెల్ లేదా మట్టి త్రవ్వి తరలించిన యెడల ఆంధ్రప్రదేశ్ చిన్న తరహా ఖనిజ నియమావళి, 1966 ప్రకారం చర్యలు తీసుకొనబడతాయని హెచ్చరించడమైనది.
Prajavartha Online Telugu News