
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్సీ అభ్యర్థి “ఆలపాటికి” మద్దతు ప్రకటించిన ఆర్. పి. ఏ, (ఏ) నేషనల్ సెక్రెటరీ పేరంగౌడ్. విజయవాడ. కేంద్ర మంత్రి సామాజిక న్యాయశాఖ మంత్రి మరియు సాధారిక జాతీయ అధ్యక్షులు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా శ్రీరామదాసు (అత్వాలే) ఆదేశానుసారం మాజీ మంత్రి, ప్రస్తుత పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండల అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి సంపూర్ణ మద్దతు తెలియజేయమని ఆర్.పి.ఐ.(ఏ) నేషనల్ సెక్రెటరీ పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ కి తెలియజేసినట్లు ఒకప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యావంతులు అందరూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బలపరిచిన అభ్యర్థి అందరం కూడా ఓటు ద్వారా విజయం చేకూర్చాలని ప్రార్ధిస్తున్నాను అని. పేరం గౌడ్ అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆలపాటిని శాసనమండలికి పంపిస్తే సమస్యలు పరిష్కారానికి ఎంతో మేలు చేస్తారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఎన్ డి ఏ కూటమి మద్దతు ఇచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటిని అఖండ మెజారిటీతో గెలిపించాలని, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అత్వాలే) బలపరిచిన కూటమి బలపరిచిన ఆలపాటికి మద్దతు ఇవ్వాలని, ఈనెల ఫిబ్రవరి 27 తేదీన జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని నేషనల్ సెక్రెటరీ పేరం శివనాగేశ్వరరావు గౌడ్ పట్టభద్రులను కోరారు. విజయవాడలోని రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నేషనల్ సెక్రెటరీ శివనాగేశ్వరరావు గౌడ్ మాట్లాడుతూ ఎన్డీఏ మద్దతు ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి ఎన్డీఏ కూటమి భాగస్వామి పార్టీ అయినా రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలియజేశారు. ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి బలపరిచిన అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపిద్దామని పట్టభద్రులను కోరారు. ఆలపాటి గెలుపును కాంక్షిస్తూ ఫిబ్రవరి 23 ఆదివారం విజయవాడ ఐలాపురం (శ్రీరామ్ ఫంక్షన్ హాల్) హోటల్లో రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ (ఆత్వాలే) ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేస్తున్నామని పేరం గౌడ్ తెలిపారు.
Tags vijayawada
Check Also
మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …
Prajavartha Online Telugu News