Breaking News

వ్యవస్థాపకత అభివృద్ధి కార్యక్రమం పై ఉచిత శిక్షణ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, వ్యాపార నిర్వహణ శక్తి సామర్థ్యం పై ఫిబ్రవరి 24వ తేదీ అనగా సోమవారం నుంచి ఉచిత శిక్షణ. తిరుపతి జిల్లా లోని ,మహిళా ప్రాంగణం, తిరుపతి నందు సంకల్ప్ పథకం లో బాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, డి ఆర్ డి ఏ మరియు మెప్మా వారి సహకారంతో ఈనెల 24వ తేదీ నుంచి మూడు రోజులు పాటు, (3), వ్యవస్థాపకత అభివృద్ధి కార్యక్రమం పై ఉచిత శిక్షణ నిర్వహించనున్నామని, జిల్లా నైపుణ్యభివృద్ది సంస్థ అధికారి, ఆర్. లోకనాధం తెలిపారు. సంకల్ప్ పథకం లో బాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారు సంయుక్తంగా జరిపే ఈ శిక్షణకు ఆసక్తి ఉన్న మహిళలు దరఖాస్తు చేయాలని కోరారు. వ్యాపార నిర్వహణ శక్తి సామర్ధ్యాలు, ఔత్సాహిక పారిశ్రామికవేతగా ఎదగడానికి కావలసినటువంటి మెలకువలు, వ్యాపారం చేసుకొనుటకు కావలసినటువంటి విధి విధానాలు అనే అంశంపై శిక్షణ, వ్యాపార అభివృద్ధిలో మార్కెటింగ్, కొనుగోలు, స్టాక్ నియంత్రణ, ఖాతా పుస్తకాలు నిర్వహణ, వ్యాపార ప్రణాళిక, ఉత్పాదక అంశాలపై అవగాహన క ల్పిస్తామని చెప్పారు. శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ ఇస్తామన్నారు.

కనీస వయస్సు: 18 నుండి 45 సంవత్సరాల వయసు కలవారు

విద్యార్హత: ఎనిమిదో తరగతి పాస్ ఆర్ ఫెయిల్ మరియు ఆ పైన చదివినవారు.

యువతి యువకులు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలానే, ఆసక్తి, ఆలోచన కలిగిన వారు అర్హులు అని చెప్పారు.

ఇతర వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: 9966601867 సునేష్, ఏ పి యస్ యస్ డి సి, తిరుపతి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *