Breaking News

ఇంటి వద్ద నుంచి చెత్త సేకరణ జరిగేలా ప్రజలకు అవగాహన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా నందు 774 గ్రామ పంచాయతీలలో ఇంటి వద్ద నుంచి చెత్త సేకరణ జరిగేలా ప్రజలకు అవగాహన కల్పించి అవసరమైన అన్ని చర్యలు తీసుకొని ఈ నెల 15వ తేది నుంచి సదరు ప్రక్రియ మొదలుపెట్టడం జరిగినది. తడి మరియు పొడి చెత్తను వేరు చేయడం పై గ్రామ పంచాయతీ సిబ్బంది 22 మరియు 23 వ తేదీల యందు జిల్లాలో అన్ని గ్రామపంచాయతీలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఇంటి ఇంటికి వెళ్ళి అవగాహన కల్పించడం జరుగుతున్నది. ఇళ్ళ వద్ద సేకరించిన తడి చెత్తను సంపద తయారి కేంద్రమునకు చేరవేసి చెత్త నుండి వెర్మి కంపోస్ట్ గా తయారు చేసి విక్రయించడం జరుగుతున్నది. పొడి చెత్తను వారంలోని ప్రతి గురువారం విక్రయించడం జరుగుతుంది. అక్టోబర్ 2024 నుండి ఇప్పటి వరకు వెర్మి కంపోస్ట్ మరియు పొడి చెత్త విక్రయించి 7,20,000/- జిల్లాలోని గ్రామ పంచాయతీలు పొందడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను పునరుద్దరించడం జరుగుతుంది. గ్రామ ప్రాంతాల్లో నివసించే ప్రజలందరూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో సహకరించాలని, తడి చెత్త పొడి చెత్తను విడి విడిగా పంచాయతీ సిబ్బందికి అందజేయవలసినదిగానూ, అవకాశము ఉన్నప్పుడు తప్పనిసరిగా తమ పంచాయతీలోని చెత్త నుండి సంపద తయారు చేయు కేంద్రాన్ని సందర్శించవలసినదిగా కోరుచున్నాను.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *