Breaking News

దోమల నివారణకు ప్రత్యేక డ్రోన్లు

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగరంలో ప్రజలు దోమల వల్ల అనారోగ్యం పాలవకుండా ఉండేందుకు, విస్తృతంగా యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టడానికి 17 లక్షల రూపాయిల వ్యాయంతో రెండు మలేరియా స్ప్రింగ్ డ్రోన్ లు కొనుగోలు చేసి, బుధవారం ఉదయం రామకృష్ణ పురం బుడిమేర కాలువలో నందు ఎంఎల్ ఆయిల్స్ స్ప్రే చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న దోమల సమస్యలను అరికట్టేందుకు, ప్రజలు దోమల కాటు వల్ల అనారోగ్య పారిన పడకుండా ఒక వైపు యాంటీ లార్వే మలేరియా ఆపరేషన్స్ చేస్తున్నప్పటికీ, వరదల తర్వాత ఇప్పుడు మీరు కాలువలో పేరుకుపోయిన వ్యర్ధాలు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నప్పటికీ, నిల్వ ఉన్న నీళ్లలో దోమలు ఉత్పత్తి చెందకుండా ఉండేందుకు విజయవాడ నగర పాలక సంస్థ రెండు డ్రోన్లను వాటి ద్వారా నిరంతరంగా ఎంఎల్ ఆయిల్స్ స్ప్రే చేస్తూ దోమల ఉత్పత్తిని లేకుండా చూసి ఎందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

బుడమేరు వరదల తర్వాత ఖాళీ స్థలాలలో బుడమేరు కాలువలో దోమల ఉత్పత్తి ఎక్కువైందని అందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇంకాను దోమల సమస్యలు ఉన్నందున, ప్రజలు దోమల కాటు వల్ల అనారోగ్య బారిన పడకుండా ఉండేందుకు, నగరపాలక సంస్థ ఇప్పుడు స్వయంగా రెండు డ్రోన్లు కొనుగోలు చేయడం వల్ల యుద్ధ ప్రాతిపదికన దోమల సమస్యలు నివారించేందుకు స్ప్రే చేపడుతున్నారని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *