Breaking News

అనధికార, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు… : కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో అనుమతులు లేని, నగరపాలక సంస్థ నుండి అనుమతులు పొంది నిబందనలకు విరుద్ధంగా చేపట్టే నిర్మాణాలపై కఠిన చర్యలు తప్పవని, భవన నిర్మాణ పనులు ప్రారంభించిన నాటి నుండే నిబందనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, గౌరవ దేశ అత్యున్నత న్యాయస్థానం 2024 డిశంబర్ 17న వెలువరిచిన ఉత్తర్వుల మేరకు ఏపి హైకోర్ట్ రిజిస్ట్రార్ ఆదేశాలను అనుసరించి రాష్ట్ర పురపాలన,పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ రాష్ట్రంలో అనధికార కట్టడాల నిరోధానికి ప్రత్యేక మార్గదర్శకాలను అమలు చేయాలని ఫిబ్రవరి 2న ఉత్తర్వులు జారీ చేశారన్నారు. సదరు ఉత్తర్వులను గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో తక్షణం అమలులోకి వస్తాయని, భవన నిర్మాణదారులు, బిల్డర్లు విధిగా పాటించాలని, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. భవన నిర్మాణానికి అనుమతులిచ్చే సమయంలోనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందిన తర్వాతనే భవనంలోని నివాసానికి అనుమతి ఇస్తామని భవన నిర్మాణ యజమాని నుండి అంగీకార పత్రం తీసుకుంటామన్నారు. భవన నిర్మాణదారులు భవన నిర్మాణాలు పూర్తి అయ్యే వరకు నిర్మాణ అనుమతి ప్లాన్ ని ముందువైపు ఏర్పాటు చేసి ఉండాలన్నారు. నిర్మాణ సమయంలో ఉల్లంఘనలు జరగకుండా పట్టణ ప్రణాళిక అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తారని, భవన నిర్మాణ యజమాని విధిగా రిజిస్టర్ నిర్వహించాలని, సంబందిత వార్డ్ ప్రణాళిక అధికారులు నిర్మాణ దశలో ఉన్న భవనాలను తనిఖీలు నిర్వహించేప్పుడు సదరు రిజిస్టర్ లో తనిఖీ చేసిన తేదీతో పాటు, నిర్మాణం నిబందనలకు అనుగుణంగా జరుగతున్నదీ, లేనిదీ పూర్తి వివరాలను నమోదు చేస్తారన్నారు. భవన నిర్మాణంలో ఒప్పందాలను, నిబందనలను ఉల్లఘించినట్లు తనిఖీల్లో గుర్తిస్తే సదరు నిర్మాణాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ నిలిపుదల చేస్తామని, ఇందుకు విరుద్దంగా వ్యవహరించిన అధికారులపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆక్యుపెన్సీ పొందిన అనంతరం కూడా అనధికార నిర్మాణాలు చేస్తే, నిర్మాణాలను అతిక్రమించిన చర్యలు తప్పవన్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేని భవనాలకు త్రాగునీరు, డ్రైనేజి, విద్యుత్ కనెక్షన్ లు మంజూరు చేయబడవన్నారు. అక్రమ నిర్మాణాల్లో వ్యాపారాల నిర్వహణకు ట్రేడ్, వ్యాపారాలకు సంబందించిన అన్ని రకాల అనుమతులు మంజూరు చేయబడవన్నారు. బ్యాంక్ లు లేదా ఇతర ఆర్ధిక సంస్థలు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉన్న భవనాలకే రుణాలు మంజూరు చేస్తాయన్నారు. అతిక్రమించిన నిబందనలను క్రమబద్ధీకరించుకొని ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసిన 90 రోజుల్లోగా అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన, తుది అనుమతులను జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *