-ముఖ్యఅతిథిగా విచ్చేసిన జడ శ్రావణ్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2017 టిడిపి ప్రభుత్వంలో దారుణ హత్యకు గురయిన గిరిజన బాలిక సుగాలి ప్రీతి పై విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్ లో ఓ పాటను ఆవిష్కరించారు న్యూ హోప్ ఫౌండేషన్ చైర్మన్ మంచా నాగమల్లేశ్వరి ఆహ్వానం మేరకు…ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జైభీమ్ రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు,హైకోర్టు ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ పాల్గొన్నారు. ముందుగా పాట పోస్టర్ ను ఆవిష్కరించారు జడ శ్రావణ్, న్యూ హోప్ ఫౌండేషన్ సభ్యులు…అనంతరం జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ 2017 టిడిపి ప్రభుత్వంలో సుగాలి ప్రీతి అత్యంత కిరాతకంగా,దారుణంగా హత్యకు గురయితే ఇప్పటి వరకు సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం దక్కకపోవడం బాధాకరం అన్నారు. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ సుగాలి ప్రీతి హత్య పై కొన్ని వందల సార్లు మాట్లాడారని,ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఎన్నో మాట్లాడారని దుయ్యబట్టారు… 2017 లో హత్యకు సుగాలి ప్రీతి హత్యకు గురైతే 2020 లో వైసిపి ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిందని తెలిపారు…అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా విచారణ ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదన్నారు జడ శ్రావణ్…ఎన్నికల సమయంలో కొన్ని వందల సార్లు సుగాలి ప్రీతి హత్యపై మాట్లాడిన పవన్…అధికారంలోకి వచ్చాక ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. సినిమాలో డైలాగులు మరిచిపోయినట్లు పవన్ సుగాలి ప్రీతి కేసును మరిచిపోయినట్టున్నారని అన్నారు..పవన్ కళ్యాణ్ కు నిబద్ధత,నిలకడ లేదని దుయ్యబట్టారు జడ శ్రావణ్..కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజీపీ పెద్దలతో మాట్లాడి పవన్ సుగాలి ప్రీతి కేసును సీబీఐ తో దర్యాప్తు చేయించ వచ్చు కదా అంటూ ప్రశ్నించారు జడ శ్రావణ్ …జగన్ ప్రభుత్వం సుగాలి కుటుంబానికి ఉద్యోగం,5 ఎకరాలు పొలం ఇచ్చిందని….తాను సుగాలి ప్రీతి కుటుంబం కోసం పోరాడా నని జడ శ్రావణ్ వాపోయారు. న్యూ హోప్ ఫౌండేషన్ రచించిన పాటతో ప్రతి ఒక్కరూ కదిలిరావాలని,ప్రీతి కుటుంబానికి న్యాయం జరగాలని జడ శ్రావణ్ కోరారు….అనంతరం న్యూ హోప్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ మంచా నాగమల్లేశ్వరి, ప్రముఖ గాయకుడు రేజెండ్ల రాజేష్, సినీ మ్యూజిక్ డైరెక్టర్ నందన్ రాజు బొబ్బిలి మాట్లాడుతూ…ఈనెల 8 న మహిళా దినోత్సవం రోజున పాటను విడుదల చేస్తున్నట్లు తెలిపారు…రాష్ట్రంలో మహిళలు,యువతులపై జరుగుతున్న ఆకృత్యాలు,అఘాయిత్యాలు కలచి వేస్తున్నాయని…అలాంటి ఆవేదనలో పుట్టుకొచ్చింది సు గాలి ప్రీతి పాటని తెలిపారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ప్రతి ఒక్కరూ ప్రీతి కుటుంబానికి అండగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో జైభీమ్ రావు భారత్ పార్టీ ప్రధాన కార్యదర్శి పరసా సురేష్,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News