Breaking News

యువత ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి

-మంత్రి లోకేష్ ను కలిసిన నూతన ఎమ్మెల్సీలు రాజా, రాజశేఖర్

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త :
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్ మంగళవారం మంగలగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలను మంత్రి అభినందించారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఈ విజయంతో మనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. రాష్ట్రంలో యువత మనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చే దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. 5ఏళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పనను కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్ చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో దేవినేని ఉమ, నెట్టెం రఘురాం, ముమ్మిడివరం ఎమ్మెల్యే సుబ్బరాజు, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, మాజీ ఎమ్మెల్యే వర్మ, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *