Breaking News

యధావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

-ఈనెల 10వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 10వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. శాసనమండలి ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున కొంతకాలం పి జి ఆర్ ఎస్ (గ్రీవెన్స్) కు తాత్కాలిక విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ ముగిసినందున యధావిధిగా పీజిఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తామని దీనిలో భాగంగా కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో ఉదయం 10 గంటల నుంచి నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. కలెక్టరేట్ తో పాటు డివిజనల్, మండల, మున్సిపల్, సచివాలయ స్థాయిలోనూ పిజి ఆర్ఎస్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆ ప్రకటనలో కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *