Breaking News

వసతి గృహము సందర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్. ఎన్.శ్రీ లక్ష్మి పట్టణంలోని పలు సంక్షేమ వసతి గృహాలను సందర్శించారు. ఉమెన్స్ కాలేజీ సమీపంలోని ఉన్న ఎస్.సి. సంక్షేమ బాలుర వసతి గృహము, ఎస్.టి. సంక్షేమ బాలికల వసతి గృహము మరియు గవర్నమెంట్ వర్కింగ్ ఉమెన్స్ వసతి గృహమును సందర్శించి వసతులను మరియు ఆహారన్ని పరిశీలించారు. వసతి గృహాల సిబ్బందితో మాట్లాడుతూ విద్యార్ధులకు సురక్షిత త్రాగు నీరు, మంచి ఆహారం అందించాలనన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వసతి గృహ ప్రాంగణంలో అవసరమైన మరమ్మత్తులను ఎప్పటికప్పుడు చేయించాలని అన్నారు, మంచి ఆహారాన్ని అందించడంతో పాటు వారికి ఎలాంటి వైద్య సహాయం అవసరమైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారికి అందిస్తున్న సేవల గురించి వివరించారు. వసతి గృహములో ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియ జేయాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *