-సే నో టూ ప్లాస్టిక్ సంతకాలు చేసిన మంత్రి, తదితరులు
-సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారిద్దాం
-నో యూస్ సింగిల్ ప్లాస్టిక్ ఇంటింటి ప్రచార పోస్టర్ ను ఆవిష్కరించిన , ప్రతిజ్ఞ చేసిన మంత్రి కందుల దుర్గేష్ , అధికారులు
-మంత్రి కందుల దుర్గేష్
-కలక్టర్ పి. ప్రశాంతి
-ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం నగరపాలక సంస్థ అధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ ర్యాలీ- సింగిల్ యుజ ప్లాస్టిక్ పై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు, స్వచ్ఛంధ్ర ప్రతిజ్ఞ, సంతకం ప్రచారం, పోస్టర్ ఆవిష్కరణ , స్టాల్ల్స్ సందర్శన తదితర కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ , జిల్లా ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్, శాసన సభ్యులు , మునిసిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. తొలుత ర్యాలినీ జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పర్యటక సాంసృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గెష్ మాట్లాడుతూ , ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు. 2047 నాటికి భారత దేశాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రథాన మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అధ్వర్యంలో అడుగులు వేయడం జరుగుతోందన్నారు. ప్రభుత్వము కార్యాచరణ, చట్టాలు కొన్ని ఆదేశాల మేరకు అధికారులు కొన్ని కార్యక్రమాల చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. అయితే వాటిని ఆచరణ సాధ్యం చెయ్యాల్సిన బాధ్యత సమాజం పై ఉందన్నారు. నా నుంచే మార్పు కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అందరం కలిసి ఈ కార్యక్రమము విజయవంతం చేయడంలో అన్ని శాఖలు సమన్వయం చేసుకోవడం ముఖ్యం అన్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రత్యామ్నాయ ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రసంగాలతో కాకుండా సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం లో ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావాలని, ప్రజల్లో చైతన్యం తీసుకుని వొచ్చే అవకాశం నేపధ్యంలో నిజమైన స్పూర్తి తో పని చెయ్యడం ముఖ్యం అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఇందు కోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యెక ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్టేజ్ బై స్టేజ్ విధానంలో సింగ్లిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సి ఉందన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం పై సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం చర్యల తీసుకోవలసి ఉందన్నారు. దశాల వారీగా వినియోగాన్ని తగ్గించాల్సీ ఉందన్నారు. ఇందుకు ఒక నిర్దుష్ట కార్యాచరణ ప్రణాళిక స్థిరమైన విధానంలో చేపట్టవలసి ఉందన్నారు. 2014-15 లో చేపట్టినా ఈ కార్యక్రమం ఇప్పటికీ వినియోగం తగ్గక పోవడం చూస్తున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి అవగాహాన కల్పించడం ద్వారా సుసాధ్యం చెయ్యగలుగుతామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ లో భాగంగా సింగిల్ యుజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండం లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర – స్వచ్చంధ్ర కార్యక్రమాలలో భాగంగా ప్రతినెలా ఒక థీమ్ తో కూడిన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే మార్చి నెలలో సింగిల్ యాజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించే క్రమంలో అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని తెలిపారు. స్వచ్ఛంధ్ర కార్యక్రమం నిర్వహణా పనితీరు పై, ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాల అమలు తీరుపై తూర్పు గోదావరి జిల్లా ప్రత్యేక సీనియర్ అధికారి ప్రవీణ్ కుమార్ సమీక్షించనున్నట్లు కలక్టర్ ప్రశాంతి తెలియ చేశారు.
శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామ కృష్ణ లు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో స్వచ్చ ఆంధ్రా ఉద్యమం లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు మాట్లాడుతూ, దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి కోసం తమదైన శైలిలో చొరవ తీసుకోవడం నిదర్శనం అన్నారు. ప్రతి ఒక్కరూ సమాజం పట్ల బాధ్యత వహించాల్సి ఉందని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. ఆరోగ్యం కన్నా డబ్బులు విలువైనది కాదని గుర్తుంచుకోవాలని కోరారు.
మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ మాట్లాడుతూ, నగరంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించే క్రమంలో వివిధ వ్యాపార సంస్థలకు, ప్రజలకి ఇంటింటి తిరిగి అవగాహనా ఇవ్వడం జరిగిందన్నారు. ప్రత్యామ్నాయ ఉత్త్పత్తులని వాడడం పర్యావరణ పరిరక్షణ లో భాగస్వామ్యం కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పుష్కర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ ఉత్పత్తుల స్టాల్ల్స్ ప్రదర్శనా తిలకించారు. అనంతరం నో టూ ప్లాస్టిక్ ఇంటింటి ప్రచార పోస్టర్ ఆవిష్కరించి , నో యూస్ ప్లాస్టిక్ సంతకాలు చేసి తమ వంతుగా మద్దతు తెలియ చేశారు, అనంతరం స్వచ్చ ఆంధ్రా ప్రతిజ్ఞ చేశారు.
ఈ ర్యాలీలో ఆర్ ఎమ్ సి అధికారులు, సిబ్బంది శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News