
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పలు ప్రాంతాలలో జరిగింది. శనివారం గాంధీనగర్‌లోని ఐనాక్స్ ధియేటర్ వద్ద జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన ఎంఆర్‌ఓ ఎం.వెంకటరామయ్య మాట్లాడుతూ సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధించారని, ప్రజలందరూ దీనికి సహకరిస్తూ కేవలం గుడ్డ సంచులను, జూట్ సంచులను వాడాలన్నారు. పర్యావరణానికి హానికరమైన 19 రకాల సింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తువులను ప్రభుత్వం నిషేధించిందన్నారు. పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే ప్రజల సహకారంతోనే సాధ్యం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎస్.వి.ఎస్.శ్రీధర్ మాట్లాడుతూ 120 మైక్రోన్లకంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను పూర్తిస్థాయిలో నిలిపివేయాలని, అవి పర్యావరణాన్ని హాని కలిగిస్తాయని, భూమిలో కలవటానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని, దాని నివారించేందుకు పర్యావరణహితమైన వస్తువులనే వాడాలని, సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకం కొనటం అమ్మకం నిషేధం పూర్తి స్థాయిలో జరగాలన్నారు. ప్రజలందరూ దీనికి సహకరిస్తూ కేవలం గుడ్డ సంచులను, జూట్ సంచులను వాడాలని కోరారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నిత్యం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. అనంతరం అధికారులు, నాయకులు, స్థానికులు, విద్యార్దులు, పర్యావరణాన్ని కాపాడతామని ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ప్లకార్డులు ధరించి విద్యార్దులు ర్యాలీ నిర్వహించిన ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 36 డివిజన్ కార్పొరేటర్ బాలగోవింద్, 36 వార్డు స్పెషల్ ఆఫీసర్ భవానీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ ఎన్.మస్తాన్‌రావు, 4 సచివాలయాల సిబ్బంది, శానిటరీ సిబ్బంది ఎల్లారావు తదితరులు, స్థానిక ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, శారదా ఇంగ్లీషుమీడియం హైస్కూల్, ఉపాధ్యాయులు, విద్యార్దులు, సిబ్బంది, వ్యాపారస్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News