విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెలవు దినాలలో కూడా పన్ను చెల్లించుటకు క్యాష్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. శనివారం నాడు ప్రధాన కార్యాలయంలో విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలందరూ ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను, డ్రైనేజ్ పన్ను, త్రాగునీటి పన్నులు చెల్లించుటకు విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో గల అన్ని క్యాష్ కౌంటర్లు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మార్చి 31, 2025 వరకు నగర ప్రజలు తమ తమ అసెస్మెంట్లకు ఉన్న పన్నులు త్వరితగతిన చెల్లించి, వడ్డీ పడకుండా సకాలంలో చెల్లించవగలరని కోరారు. ఎక్కువ కాలం నుండి పన్నులు చెల్లించని వారికి డ్రైనేజ్ కనెక్షన్, త్రాగునీటి కనెక్షన్ తొలగిస్తున్నారని, ప్రజలు దీన్ని గమనించి విజయవాడ నగరపాలక సంస్థ వారికి చెల్లించవలసిన పన్ను బకాయలు త్వరితగతిన చెల్లించాలని తెలిపారు.
Prajavartha Online Telugu News