-స్క్రీనింగ్ టెస్ట్ కు హజరు కానున్న 696 మంది అభ్యర్థులు
-పరీక్షా కేంద్రంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతి లేదు
-నియమాలను ఉల్లంఘించిన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది
-జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మార్చి 16 వ తేదీన ఎపిపి ఎస్సీ ద్వారా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు . పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్సిటిట్యూట్స్ నందు నిర్వహిస్తున్న పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా హల్ టికెట్ తో పాటు, ప్రభుత్వం గుర్తించి అసలు ఫోటో గుర్తింపు కార్డు తో పరీక్ష ప్రారంభించడానికి గంట ముందే పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించవలసి ఉంటుందని తెలిపారు. పరీక్ష ఉదయం పరీక్ష ఉ.9.30 నుంచి ఉ .12.00 వరకు నిర్వహిస్తామని అభ్యర్థులనుపరీక్షా కేంద్రంలోకి ఉదయం 8.30 గంటల నుంచి అనుమతించడం జరుగుతుందన్నారు.. పరీక్షలకి హాజరయ్యే అభ్యర్థులు పురుషోత్తమ పట్నం, సీతానగరం గ్రామాలకు వెళ్ళే ఆర్టీసీ బస్సులు ఈ మార్గంలో వెళతాయని తెలిపారు.పరీక్షా కేంద్రం లోకి బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులను మాత్రమే అనుమతిస్తారని, ఎలెక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, పేపర్లు అనుమతించడం జరగదన్నారు. ఆదివారం నిర్వహిస్తున్న స్క్రీనింగ్ టెస్ట్ కు 696 మంది అభ్యర్థులు హజరు కానున్నట్లు ఆమేరకు ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.
పరీక్షా కేంద్రం వద్ద శాంతిభద్రతలను సక్రమంగా నిర్వహించడం కోసం పరీక్ష రోజున పోలీసు సిబ్బందిని మోహరించడం ద్వారా వేదిక చుట్టూ పోలీసు బందోబస్తు/ భద్రతను అందించాల్సి ఉంటుందన్నారు. పరీక్ష నిర్వహించే సమయంలో పరీక్షా కేంద్రంలో 144 సెక్షన్‌ని ప్రకటించడం మరియు పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమైనప్పుడు వైద్య సహాయం అందించడానికి పరీక్షా కేంద్రంలో మెడికల్ కిట్ మరియు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లతో వైద్య సిబ్బందిని నియమించాలన్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద పరీక్ష సమయాలలో నిరంతర విద్యుత్ సరఫరా , కేంద్రంలో అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించడం మరియు పరీక్షను సజావుగా నిర్వహించడంపై కళాశాల యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎపిపి ఎస్సి అధికారులు జే. చంద్రరావు,జే. జనార్ధన్, జిల్లా సమన్వయ శాఖల ఉద్యోగులు పి పాపారావు, పి. జాన్సన్, శ్యామూల్ , కే. నవీన్ కుమార్, ఇతర సమన్వయ శాఖల ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు
Prajavartha Online Telugu News