-ఇన్చార్జి డిఎస్వో ఎమ్ నాగాంజనేయులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినియోగదారుల హక్కులపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా పౌర సరఫరాల అధికారి (ఎఫ్ఏసి) ఎం. నాగాంజనేయులు పేర్కొన్నారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ” ప్రపంచ వినియోగదారుల దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అవగాహాన కల్పించడం జరిగింది.
ఈ సందర్భంగా నాగంజనేయులు మాట్లాడుతూ వినియోగదారులు చట్టాల పై అవగాహన కలిగి , వస్తు నాణ్యత, ప్రమాణాలు పై ప్రశ్నించే తత్త్వం అలవాటు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో పాఠశాలలు, కాలేజీలు, రైతు బజార్లు తదితర ప్రదేశాలలో వినియోగదారుల హక్కుల పై వినియోగదారుల సంఘాల ద్వారా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలలో కన్స్యూమర్ క్లబ్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతీఒక్కరు చైతన్యం కలిగి మోసాలను అరికట్టేందుకు వినియోగదారుల కమీషన్ లలో ఫిర్యాదు చేసి న్యాయం పొందాలన్నారు. వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు, జిల్లా యంత్రాంగం, వినియోగదారుల ఫోరం సిద్ధంగా ఉన్నారన్నారు.
జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ వారు వినియోగదారుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయ మన్నారు. వినియోగదారులు హక్కులతోపాటు , బాధ్యతలు కూడా తెలుసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో లీగల్ మెట్రోలాజి అసిస్టెంట్ కంట్రోలర్ కె. శామ్యూల్ రాజు, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ వి. రుక్కయ్య, జిల్లా విద్యా శాఖ అడిషనల్ డైరెక్టర్ వి. వెంకట రాజు , నిడదవోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. రుద్ర, వైద్య శాఖ డెమో ఎన్. సత్యకుమార్, ఏపిఎస్ఆర్టిసి అసిస్టెంట్ మేనేజర్ ఎం. అజయ్ బాబు, ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు పవన్, విద్యాశాఖ టీవోటీలు కే. స్వామినాధన్, డి. హరిబాబు మాట్లాడారు. ట్రైనింగ్ కళాశాల విద్యార్థి కే. దేవేందర్, ఆర్ట్స్ కళాశాల విద్యార్థినులు ఎం. శ్రావణి, పి. నీరజ అంశం పై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల టీచర్లు, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, విజిలెన్సు కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News