విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఎన్నికల నిర్వహణకు కమిటీ చైర్మన్ గా గురజాల ఆనంద్ కుమార్ (జీకే) నియామకం చేశామని రాష్ట్ర సంఘ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మేడపి వెంకటప్రసాద్ తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరంలో చిట్టినగర్ లో పుల్లేటికుర్తి వారి కళ్యాణ మండపం లో ఫిబ్రవరి 9వ తేదీన లో జరిగిన విశ్వబ్రాహ్మణుల రాష్ట్రస్థాయి ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం నెంబర్ 563/73 విస్కృత స్థాయి సంఘం కార్యవర్గ సమావేశం జరిగిందని రాష్ట్ర క్రమశిక్షణ సంఘం కమిటీ మేడిపి ప్రసాద్ అధ్యక్షతన రాష్ట్ర సంఘ గౌరవ అధ్యక్షులు మాజీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మశ్రీ తోలేటి శ్రీకాంత్ రాష్ట్ర సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి నాగులకొండ అశ్లేషచారిరాష్ట్ర సంఘ వర్కింగ్ కమిటీ చైర్మన్ బోదిలపాటి ఉమామహేశ్వరరావు అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయల రాము జీకే ఆనంద్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కల్లూరు శ్రీవాణి రాష్ట్ర యువజన సంఘ నాయకులు బ్రహ్మశ్రీ ఇలుపాక శివప్రసాద్ అలాగే 23 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు తదితర సంఘ పెద్దలు నాయకులు సమక్షంలో ఈ సమావేశం జరిగిందని అన్నారు.
ఆ సమావేశంలో రాష్ట్ర కమిటీ సరైన పద్ధతులలో పని చేయకుండా రాష్ట్ర సంఘ బై లాను అతిక్రమించి సొంత పోకడులతో జాతి అభ్యున్నతి సహకరించకుండా పనిచేస్తూ సంఘ పెద్దలను నిర్ణయాలను సంఘ క్రమశిక్షణ సంఘం సూచనలను అంతమాత్రం వివరించకుండా ఎవరి అనుమతులు లేకుండా పనిచేస్తున్నటువంటి ఈయొక్క నామినేటెడ్ రాష్ట్ర కమిటీని సభ మెజారిటీ సభ్యులు అనుమతితో సంఘ బైలాను అనుసరిస్తూ రాష్ట్ర కమిటీని పూర్తిగా రద్దు చేయడం జరిగిందని రాష్ట్ర సంఘ క్రమశిక్షణకమిటీ చైర్మన్ మేడపి వెంకటప్రసాద్ తెలియజేశారు ఎన్నికల నిర్వహణ 6 నెలలకు కాలా పరిమితం నిర్ణయిస్తూ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా సంఘాల లో పనిచేస్తున్న జిల్లా కమిటీలను యధాతధంగా ఉంచితూరాష్ట్ర కమిటీని పూర్తిగా రద్దు చేయడం జరిగిందని అన్నారు నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ గా రాష్ట్ర కమిటీ బైలాను అనుసరిస్తూ బ్రహ్మశ్రీ డాక్టర్ గుడివాడ ఆనంద్ కుమార్ (జీకే) నియమిస్తూ సభ ఏకగ్రీవ తీర్మానం చేయడం అయిందని వారికి ఎన్నికల నిర్వహణకు కావలసిన కమిటీని ఏర్పాటు చేసుకునేందుకు ఎన్నికల నిర్వహణకు పూర్తి అధికారం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడమైనది అని తెలిపారు. కావున యావన్మంది విశ్వబ్రాహ్మణులు ఎన్నికల కమిటీకి సహకరించి బలమైన రాష్ట్ర నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గోకవరపు శ్రీను విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News