Breaking News

వేద విద్య ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీశ్రీ శృంగేరి శారదాపీఠం ఆధ్వర్యంలోని పల్నాడు జిల్లా మాదిపాడు గ్రామంలో ఉన్న వేద వేదాంత గురుకుల మహా విద్యాలయంలో వేద విద్య నభ్యసించదలచిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ధర్మాధికారి, ప్రొఫెసర్ డీవీఆర్ శేషాద్రి శనివారం తాడేపల్లిలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. 1993లో శ్రీ శృంగేరి శారదాపీఠం ఆశీస్సులతో స్థాపించబడిన ఈ గురు కుల మహా విద్యాలయం వేదజ్ఞానం, సనాతన ధర్మ పరిరక్షణ, అభ్యాసన లక్ష్యంగా పని చేస్తోందన్నారు. కృష్ణ యజుర్వేదం – తైత్తిరీ యక శాఖ, శుక్ల యజుర్వేదం – కాణ్వశాఖ, ఋగ్వేదం – షాకల శాఖ అందుబాటులో ఉన్నాయని, కృష్ణ యజుర్వేదం స్మార్తం అభ్యసించాలనుకునే విద్యార్థులకు ప్రత్యేకంగా బోధన అందించబడుతుందన్నారు. వేద విద్యను అభ్యసించదలచిన వారు 99630 57025 నంబర్ కు వాట్సప్ సందేశం పం పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేదాంతం రవి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *