Breaking News

నీటి శుద్ధతని నిరంతరం పరీక్షించండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు

విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త :
నీటి శుద్ధతని నిరంతరం పరీక్షించండి అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సోమవారం ఉదయం తన పర్యాటంలో భాగంగా డివిజన్లోని సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు 38 వ డివిజన్ కార్పొరేటర్ రహమతున్నీసాతో కలిసి భవానిపురం లో గల హెడ్ వాటర్ వర్క్స్, చేపల మార్కెట్, హిందూ స్మశాన వాటిక, కుమ్మరిపాలం సానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయం, పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎటువంటి సమస్య లేకుండా చూసుకోవాలని, అధికారులు నిరంతరం నీటి శుద్ధతను పరీక్షిస్తుండాలని, ప్రజల ఇంటి వద్ద నీటి పరీక్షలు నిరంతరం నిర్వహిస్తుండాలని, త్రాగునీటి సరఫరా చేసే పైపులు డ్రైన్ క్రాసింగ్ లలో లేకుండా సచివాలయం సిబ్బంది, ఏఈలు నిరంతరం పర్యవేక్షిస్తుండాలని, తరచుగా వాటర్ ట్యాంకులు రిజర్వాయర్లను పరిశుభ్రపరుస్తుండాలని అధికారులను ఆదేశించారు.

భవానిపురం లో గల స్వర్గపురి ని సందర్శించి, పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మొక్కలను నాటి హరితాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

కుమ్మరిపాలెం సెంటర్లో ప్రస్తుతం ఉన్న సానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఆధునికరించి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళికను తయారు చేసే నివేదికను సమర్పించాలని కమిషనర్ అన్నారు.

ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెంటింగ్ ఇంజనీర్లు పి.సత్యనారాయణ, పి సత్యకుమారి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) పి వెంకటనారాయణ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *