Breaking News

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాలల రక్షణ చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో బాలల సంరక్షణ పథకాలు క్షేత్ర స్థాయిలో సక్రమంగా అమలు చేసి సత్ఫలితాలు సాధించేలా సంబంధిత శాఖల అధికారులు పటిష్ట ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా బాలల సంక్షేమ మరియు సంరక్షణ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాధ్ తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూఅన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాలల రక్షణ చర్యలు సక్రమంగా అమలు కోసం ప్రతి గ్రామ, వార్డు స్థాయిలో బాలల సంక్షేమ మరియు సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి కమిటీలు వారి పరిధిలోని బాల, బాలికల రక్షణ, పునరావాసం, విద్యా , వైద్యం తదితర అంశాలపై చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లో సక్రమంగా పౌష్టికాహారం అందించేలా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బడి బయట బాలలను వెంటనే పాఠశాలలో చేర్పించాలని , కౌమార బాలలు పాఠశాల నుంచి డ్రా పౌట్స్ కాకుండా నిరంతరం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పర్యవేక్షించాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్న బాలలకు స్కిల్ డెవల్మేంట్ శాఖ ద్వారా నైపుణ్యాలపై శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాలల స్నేహ పూర్వక కార్యక్రమాలైన పార్కులు, ఇతర మౌలిక సౌకర్యాల కల్పన కోసం మున్సిపాల్టీలు, పంచాయితీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బాలల వసతి సదనాల్లోని సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
సమావేశంలో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పీడీ యం.ఉమా దేవి , జిల్లా వైద్యాధికారి డా. విజయలక్ష్మీ, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక, కార్మికశాఖ సంయుక్త కమిషనర్ కృష్ణవేణి, జిల్లా పంచాయితీ అధికారి సాయికుమార్, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు, మెప్మా పీడీ విజయలక్ష్మీ, విభిన్న ప్రతిభావంతులు ఏడీ సువార్త, జిల్లా స్కిల్ డెవలప్మేంట్ అధికారి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *