Breaking News

ప్ర‌కృతి విపత్తుల స‌మ‌యంలో విద్యుత్ ఉద్యోగుల సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివి

-బీసీ ఉద్యోగుల‌ సంఘం డైరీ ఆవిష్క‌ర‌ణ స‌భ‌లో విద్యుత్ శాఖ‌ మంత్రి గొట్టిపాటి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్ర‌కృతి విప‌త్తులు, ఆప‌త్కాల స‌మ‌యాల్లో విద్యుత్ శాఖ ఉద్యోగుల సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివ‌ని మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ పేర్కొన్నారు. స‌చివాల‌యంలో ఏపీ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డైరీ, క్యాలెండ‌ర్ ను మాజీ విద్యుత్ శాఖ మంత్రి కిమిడి క‌ళా వెంకట్రావుతో క‌లిపి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ మంగ‌ళ‌వారం ఆవిష్క‌రించారు. వైసీపీ ప్ర‌భుత్వ అనాలోచిత చ‌ర్య‌ల‌తో, సంస్థాగ‌తంగా విద్యుత్ శాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప‌లు స‌మ‌స్య‌ల‌ను ఏపీ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్య‌క్షులు పోలాకి శ్రీనివాస‌రావు ఈ సంద‌ర్భంగా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సానుకూలంగా స్పందించారు. ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల‌కు అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. విజ‌య‌వాడ బుడ‌మేరు వ‌ర‌ద‌లు, తుఫానుల స‌మ‌యంలో ప్రాణాల‌కు తెగించి విధి నిర్వ‌హ‌ణ‌లో పాల్గొన్న‌ విద్యుత్ ఉద్యోగుల సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివ‌ని మంత్రి గొట్టిపాటి ప్ర‌శంసించారు. వైసీపీ ప్ర‌భుత్వ త‌ప్పిదాల‌తో నిర్వీర్యమైన విద్యుత్ వ్య‌వ‌స్థ‌ను ఉద్యోగుల సహాయంతోనే మ‌ర‌లా గాడిలో పెడుతున్నామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఉద్యోగులు త‌మ హ‌క్కుల‌ను కూడా కోల్పోయార‌ని, కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌న‌న్న న‌మ్మ‌కం ఏర్ప‌డింద‌ని సంఘం నేత‌లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో బీసీ నేత కేశ‌న శంక‌ర‌రావు, ఉపాధ్యక్షులు జీ.రాము, సెక్రెటరీ ఫైనాన్స్ ఎస్. వెంకటేశ్వర్లుతో పాటు ఉమ్మ‌డి 13 జిల్లాల‌కు చెందిన సంఘం నేత‌లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *