Breaking News

సూప‌ర్ స్పెషాలిటీ విభాగాల్లో 146 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

-డాక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుద‌ల చేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ మెడిక‌ల్ స‌ర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య విద్య సంచాలకులు(డిఎంఇ) ప‌రిథిలోని ఆసుపత్రుల్లో డైరెక్ట్ మ‌రియు లేట‌ర‌ల్ ఎంట్రీ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల పోస్టుల భ‌ర్తీ కి ఈనెల 26న వాకిన్ ఇంట‌ర్వ్యూకి అర్హులైన అభ్యర్ధులను ఆహ్వనిస్తూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన
అర్హ‌త‌లు ఇత‌ర వివ‌రాల కోసం htps://dme.ap.nic.in మ‌రియు http://apmsrb.ap.gov.in/msrb/. వెబ్ సైట్ల‌ను సంప్రదించాలని సూచించింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు విజ‌య‌వాడ‌లోని హ‌నుమాన్ పేట‌, ఓల్డ్ జిజిహెచ్ క్యాంప‌స్ లో ఉన్న డిఎంఇ కార్యాల‌యంలో ఉద‌యం 10.30 గంట‌ల నుండి మధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు వాకిన్ ఇంట‌ర్వ్యూ కు హాజ‌రు కావాలని తెలిపింది.

ఖాళీల వివరాలు
సిటి సర్జరీ విభాగంలో 15, కార్డియాలజీ విభాగంలో 15, ఎండో క్రైనాలజీ విభాగంలో 5, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ లో 9, మెడికల్ అంకాలజీలో 16, నియో నేటాలజీలో 2, నెఫ్రాలజీలో 19, న్యూరో సర్జరీలో 16, న్యూరాలజీ లో 13, పెడియాట్రిక్ సర్జరీలో 5, ప్లాస్టిక్ సర్జరీలో 4, సర్జికల్ అంకాలజీలో 14, యూరాలజీలో 12, వాస్కులర్ సర్జరీలో 1చొప్పున మొత్తం 146 పోస్టులకు వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *