Breaking News

ప్రతి మహిళా చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో ప్రతి మహిళ చట్టాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని ప్రొడక్షన్ ఆఫీసర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ (పోనిక్) ప్రతినిధి జాన్సన్ అన్నారు. బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా స్థానిక సింగ్ నగర్ లోని 59 వ డివిజన్ కమ్యూనిటీ హాలు లో మంగళవారం మహిళలు, బాలల చట్టాలు, బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య ముఖ్య అతిథిగా హాజరైన పోనిక్ ప్ర‌తినిధులు జాన్సన్, శారదలు మాట్లాడుతూ మహిళలు, చిన్నారులు వృద్ధులకు ప్రత్యేకంగా చట్టాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని అన్నారు. ఒకసారి చట్టం ద్వారా బాలికలు చిన్నారులు మహిళలపై ఎటువంటి అఘాయిత్యాలకు ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించేందుకు ఫోక్సో చట్టం ఉందన్నారు. బాల్య వివాహాలు నిర్వహించడం చట్ట విరుద్ధమని, చట్టాలపై ప్రతి మహిళ పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఉమెన్ హెల్ప్ లైన్ 181, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, ఉమెన్ ట్రాఫికింగ్ తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పీహెచ్ సి డాక్టర్ సూజన్, ఐసిడిఎస్ ఎసిడిపివో వి. విజయ, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *