Breaking News

ఉపాధి హామీలో సంవత్సరానికి ప్రతి కూలీకి 12 వేల రూపాయలు ఉపాధి భృతి ఇవ్వాలి!

-ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానిస్తే కూలీలకు ద్రోహమే!

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధి హామీ పథకం లో పనిచేస్తున్న ప్రతి గ్రూపుకి పని కల్పించాలని, పని కల్పించకపోతే ఉపాధి భృతి గా సంవత్సరంలో ప్రతి కూలీకి 12 వేల రూపాయలు అందించాలని, రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని చర్చ జరిగినట్లు, వ్యవసాయానికి అనుసంధానం చేస్తామనడం చట్టం స్ఫూర్తికి విరుద్ధమని , ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించవద్దని, బడ్జెట్ లో సింగిల్ రూపాయి కూడా కేటాయించని వారు వ్యవసాయానికి అనుసంధానం చేస్తామనే నైతిక హక్కు లేదని, అనుసంధానం పేరుతో కూలీలకు ద్రోహం తలపెట్టవద్దని పంచాయతీరాజ్ మరియు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా ముఖ్య ప్రధాన కార్యదర్శి శశి భూషణ్ కుమార్ ని రాష్ట్ర సచివాలయలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రతినిధి బృందం రాష్ట్ర గౌరవాధ్యక్షులు జల్లి విల్సన్, రాష్ట్ర అధ్యక్షులు సి హెచ్ కోటేశ్వరరావు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, రాష్ట్ర కార్యదర్సులు బి కేశవ రెడ్డి, కాబోతు ఈశ్వర్ రావు, ఉపాధ్యక్షులు చిలుకూరు వెంకటేశ్వరరావు లు కలిసి మెమోరాండం సమర్పించి వివరించడం జరిగిందని తెలియజేసారు.2005 లో అప్పటి యూపీఏ కేంద్ర ప్రభుత్వం వామపక్ష పార్టీల సహకారంతో, వ్యవసాయ కార్మిక సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు దీర్ఘకాలిక ఆందోళన పోరాటాల ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక వలసలు,ఆకలి చావులు పెరుగుతుంటే,పని అయినా కల్పించండి, తిండైనా పెట్టండి అనే పోరాటాలు చేసిన సందర్బంగా, సంవత్సరంలో 100 రోజులు పనులు గ్యారెంటీ కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం చేయబడి, తీసుకురావడం జరిగిందని, ఇది గ్రామీణ పేదలకు వరమని భావించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి గ్రామీణ పేదల్లో వ్యవసాయ కార్మిక సంఘాలు విస్తృత ప్రచారం చేయడం జరుగిందని, ఈ పథకాన్ని ఉపయోగించుకుని కొంతమేరకు ఆర్థిక వెసులుబాటు కల్గుతున్నందున, పేదలు ఖర్చు పెట్టబెట్టే దేశ ఆర్థికాభివృద్ధి వైపు పయనం సాగిస్తున్నదని, స్వయానా దేశంలో వుండే ఆర్థిక వేత్తలు చెప్పారని,ఈ చట్టం అమలులో గ్రామీణ పేదల సంఘాలు అప్రమత్తమై ఆచరణ సాధ్యం కానీ నిబంధనలు అరకొర బడ్జెట్ కేటాయింపులు నీరు కార్చే విధానాలకు వ్యతిరేకంగా, చట్టం రక్షణకు పోరాడుతున్నామని, ఈ చట్టం పక్కాగా అమలు జరిగితే పేదలకు ఉపాధి,గ్రామీణ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధులు 90 శాతం పేదల సంక్షేమానికి,అభివృద్ధికి వినియోగించాలని కోరామని వారు తెలియజేశారు. ఉపాధి హామీ పనులు సక్రమంగా పెట్టనందువలన వలసలు తీవ్రమయ్యాయని, వలసలు ఆపాలని, ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేయరాదని, మెటీరియల్ కాంపోనెంటును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, పథకంలో నిధులు పక్క దారి పట్టించరాదని, కూలీల భద్రత కోసమే వచ్చిన ఈ పథకంలోని నిధులన్నీ వారికే కేటాయించాలని, కుటుంబ జాబు కార్డు తో నిమిత్తం లేకుండా ప్రతి వయోజనునికి విడిగా జాబ్ కార్డు ఇవ్వాలని, పని అడిగిన ప్రతి ఒక్కరికి 200 రోజులు పని దినాలు కల్పించాలని, రోజు కూలి 700 రూపాయలు ఇవ్వాలని, యంత్రాలను, కాంట్రాక్టర్లను నిషేధించాలని, వంద రోజులు పని పూర్తి చేసుకున్న ప్రతి ఉపాధి హామీ కూలికి పథకంలో చూపెట్టిన విధంగా పనిముట్లు ఇవ్వాలని, పని ప్రదేశాలలో టెంట్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని, ఎండాకాలంలో మజ్జిగ సరఫరా చేయాలని, రెండు పూటలా పని విధానం తీసివేసి, సమ్మర్ అలవెన్స్ పునరుద్ధణ చేయాలని,మెటీలకు గుర్తింపు కార్డులు జారీ చేసి రోజుకు అయిదు రూపాయలు పారితోషకం ఇవ్వాలని, చేసిన పనికి పే స్లిప్పులు ఇవ్వాలని, పోస్ట్ ఆఫీస్ ల ద్వారా బిల్లులు చెల్లించాలని, పది వారాలుగా పెండింగ్లో ఉన్న పాత బకాయిలను తక్షణం విడుదల చేయాలని, పని ప్రదేశంలో మరణిస్తే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, వడదెబ్బ గాయాల పాలైతే మెరుగైన ఆరోగ్య సేవలు అందించి కోలుకునే వరకు ఉపాధి వేతనాలు అందించాలని, ఉపాధి హామీలో పని చేసే క్షేత్రస్థాయి సిబ్బందిపై రాజకీయ పక్షపాతాలు ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రామాల్లో మైక్ ప్రచారం జరగాలని, గ్రామ సభల్లో పనులు ఎంపిక చేసి బహిరంగంగా వెల్లడించాలని, సామాజిక తనిఖీ పక్కాగా నిర్వహించాలని, ఉపాధి హామీలో రాష్ట్ర మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి అందులో వ్యవసాయ కార్మిక సంఘాల ప్రతినిధులను చేర్చాలని, ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కూలీకి అదనంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మొత్తాన్ని కలిపి కూలిలకు ఇవ్వాలని, ఈ డిమాండ్లపై పంచాయతీరాజ్,గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి శశి భూషణ్ కుమార్ కి వివరించినట్లు వారు తెలియజేశారు. ప్రతినిధి వర్గంతో ఆయన ప్రతి అంశం పైన సుదీర్ఘంగా చర్చించి, ప్రతి అంశం పై ప్రభుత్వం తో చర్చించి కూలీలకు ఉపయోగపడేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *