Breaking News

గ్రామాల్లో మంచి నీటి ఎద్ద‌డి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలి, బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించాలి

-ప్ర‌భుత్వాధికారుల‌కు విన‌తి ప్ర‌తం అంద‌జేసిన పంచాయ‌తీ ఛాంపియ‌న్స్

జ‌గ్గ‌య్య‌పేట, నేటి పత్రిక ప్రజావార్త :
జయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) సారధ్యంలో నిర్వహిస్తున్న కేశినేని ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ లోని హైదరాబాద్ జాతీయ గ్రామీణ అభివృద్ధి పంచాయ‌తీ రాజ్ సంస్థలో (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ )లో శిక్షణ పొందిన పంచాయ‌తీ ఛాంపియన్స్, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. ప్రోగ్రామ్ కో-ఆర్డినేట‌ర్ జి.వి.న‌ర‌సింహారావు ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం ప‌ట్ట‌ణంలో ని ఆర్.డ‌బ్ల్యూఎస్ అండ్ ఎస్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డి.రామ‌లింగ ప్ర‌సాద్ కు గ్రామాల్లో నీటి ఎద్ద‌డి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలని , జ‌గ్గ‌య్య పేట బ‌స్ డిపో మేనేజ‌ర్ ఎమ్.రఘురామ్ కు విద్యార్ధుల కోసం ప‌లు మార్గాల్లో బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించాల‌ని విన‌తి ప‌త్రాలు అంద‌జేశారు.

జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం క్లస్టర్ గ్రామాలైన బలుసుపాడు,అనుమంచిపల్లి, గరికపాడు, తక్కెళ్ళపాడు, రామచంద్రుని పేట, తిరుమలగిరి గ్రామాల్లో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న నీటి ఎద్ద‌డి స‌మ‌స్య‌తో పాటు గ్రామంలో నెల‌కొన్న ఇత‌ర ఇబ్బందుల‌ను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డి.రామ‌లింగ ప్ర‌సాద్ కు వివ‌రించారు. ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఆశ‌య‌మైన విక‌సిత్ పంచాయ‌త్ కార్య‌క్ర‌మంలో భాగంగా పరిపూర్ణ గ్రామ వికాసం కోసం ఈ గ్రామాల్లో నిర్వ‌హించిన ప‌లు కార్య‌క్ర‌మాలు ద్వారా ఈ స‌మ‌స్య‌లు త‌మ దృష్టికి వ‌చ్చిన‌ట్లు తెలిపారు . వారు కూడా ఈ వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు . పులిచింతల డ్యామ్ గిడ్డు అందుబాటులోకి వస్తే జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలకి తాగునీటి సమస్య ఉండదని చెప్పారు.

అలాగే రామచంద్రుని పేట తక్కెళ్ళపాడు అనుమంచిపల్లి గ్రామాల్లో చ‌దువుకునే విద్యార్ధులు ఎస్ఎం పేటలో జిల్లా పరిషత్ హై స్కూల్ కి వెళ్ళటానికి బ‌స్సు సౌక‌ర్యం లేక చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ విద్యార్ధుల అవ‌స్థ‌లు గ‌మ‌నించిన పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ జ‌గ్గ‌య్య‌పేట డిపో మేనేజర్ ఎమ్.ర‌ఘురామ్ ను క‌లిసి ఆ మార్గంలో విద్యార్దుల కోసం బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించాల‌ని కోరుతూ విన‌తి ప‌త్రం అంద‌జేశారు. డిపో మేనేజర్ ఈ అంశంపై సానుకూలంగా స్పందించారు. తన పై అధికారులకు సమాచారం పంపించి తగు నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *