Breaking News

స్వర్ణాంధ్ర@2047 విజన్ లో భాగంగా సమాజంలో అట్టడుగున ఉన్న పేదల జీవన నాణ్యతను మెరుగు పరచడంమే జీరో పావర్టీ -P4 పాలసీ విధానo

-P4 పాలసీ పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి
-స్వర్ణ ఆంధ్ర @2047 విజన్ మేరకు తిరుపతి జిల్లాను సంపన్న, ఆరోగ్య, సంతోషకరమైన జిల్లాగా తీర్చి దిద్దాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణ ఆంధ్ర @2047 విజన్ లో భాగంగా పేదరికo లేని సమాజo లక్ష్యంగా ..ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల, భాగస్వామ్యంతో పి-4 సర్వే ప్రక్రియను చేపట్టడం జరింగిందని, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరము నందు జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ గారు డి ఆర్ ఓ నరసింహులు, సి పి ఓ ప్రేమ్ చంద్ తో కలిసి పి-4 సర్వే విధానo పై చర్చా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర @2047 విజన్ లో భాగంగా పేదలకు ఆర్థిక సాధికారత చేకూర్చడం, వారి జీవన ప్రమాణాల్లో అట్టడుగు స్థాయిలో గల 20 శాతం మంది నిరుపేదలను గుర్తించి సంపన్న వర్గాలు, ప్రవాస ఆంధ్రుల ద్వారా వారికి విద్య ,వైద్య, ఉపాధి అవకాశాలను కల్పించి తద్వారా పేదరికం దూరం చేయడమే పి 4 విధానం అని లక్ష్యమని తెలిపారు. జిల్లాను సంపన్న, ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జిల్లాగా తీర్చిదిద్దుటకు 15 శాతం కంటే ఎక్కువ వృద్ధిరేటును సాధించాలని తెలిపారు. అత్యంత వెనుకబడ్డ 20 శాతం కుటుంబాలకు నైపుణ్య అవకాశాలు, ఉపాధి, విద్య మరియు వైద్య రంగంలో మౌలిక వసతులు కల్పించి జీవన ప్రమాణాలు కల్పించే దిశగా పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, సంపన్న వర్గాలు చేయూతనందించాలని కోరారు. పేదల అవసరాలను గుర్తించి వారి సమగ్ర అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల రూపకల్పనకు ఈ సర్వే దోహదపడుతుందని తెలిపారు. స్వర్ణాంధ్ర@2047 లో భాగంగా 10 మార్గదర్శక సూత్రాలు అయిన సున్నా పేదరికం, ఉపాధి ,నైపుణ్యం& మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, రైతులు అగ్రిటెక్, ఇంధనం ఆదా చేయడం, ఉత్పత్తి పరిపూర్ణత, స్వచ్ఛ ఆంధ్ర, అన్ని రంగాలలో డీప్ టెక్, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటి ద్వారా అన్ని రంగాలలో 15 శాతం వృద్ధి సాధనతో 2047 విజన్ లో అన్ని స్థాయిలలో జిల్లాను మొదటి స్థానంలో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సెక్టార్ పైన ఫోకస్ చేసి అభివృద్ధి సాధించే దిశగా కృషి చేయాలన్నారు.10 మార్గదర్శక సూత్రాలలో p-4 పేదరిక నిర్మూలన మొదటి అంశం అని, జిల్లాలో అట్టడుగు స్థాయిన ఉన్న 20 శాతం మంది పేదలను గుర్తించడం ప్రతి ఇంటికి వెళ్లి సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా అన్ని శాఖల సమన్వయంతో సమిష్టి భాగస్వామ్యంతో సమర్థమైన ప్రణాళికలను రూపొందించి అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని గుర్తించి, అర్హులైన వారికి శిక్షణ మరియు స్వయం ఉపాధి పెంపొందించే దిశగా వారికి అవగాహన కల్పించాలని అన్నారు.

సి పి ఓ మాట్లాడుతూ.. p 4 సర్వే ప్రక్రియలో భాగంగా ప్రజలు తమ విలువైన అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి http:// swarnadra.ap.gov.in/ p4 లింకు ద్వారా తెలియ చేయవచ్చని తెలిపారు. పి 4 విధానం పైన వక్తలు తమ సూచనలు, అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ కి తెలియజేయగా అందరి సూచనలు సలహాల మేరకు పి-4 లక్ష్యాన్ని ముందుకు తీసుకొని అందరి సహకారం, భాగస్వామ్యం తో జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సి పి ఓ ప్రేమ్ చంద్ జిల్లా అధికారులు, విద్యావేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *